9 Years For Dochey: రెండో సినిమా కూడా దొంగతనమే

సుధీర్ వర్మ… ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వామి రారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ వర్మ. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అందరికీ నమ్మకం కలిగింది. స్వామిరారా సినిమా టెక్నికల్ గా ఎంత బ్రిలియంట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్టింగ్ లోనే “నాకు నచ్చిన ప్రతి సినిమా నుంచి నేను కాపీ కొడతాను” అని ఒక కొటేషన్ వేసి ఈ సినిమా టైటిల్ చూపించాడు సుధీర్ వర్మ.

ఇక స్వామి రారా సినిమా విషయానికి వస్తే
ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం అత్యంత పురాతనమైనది కావడంతో మార్కెట్లో భారీగా ధర పలుకుతుంది. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు. వారందరూ ఈ స్కామ్ లో ఎలా ఇరుక్కుపోయారు అనేది ఈ సినిమా కథాంశం. ఈ సినిమాను అద్భుతంగా తీసి మంచి మార్కులను సాధించుకున్నాడు సుధీర్ వర్మ.

సుధీర్ వర్మ రెండవ సినిమా
సుధీర్ వర్మ తరక్కించిన రెండో సినిమా దోచేయ్. నాగచైతన్య, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అప్పుడు కూడా మేకర్స్ ఆఫ్ అత్తారింటికి దారేది అంటూ. టెక్నీషియన్స్ ఆఫ్ స్వామిరారా అంటూ ట్రైలర్ రిలీజ్ చేశారు.

- Advertisement -

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే
ఈ చిత్రం బ్యాంకు దొంగతనంతో మొదలవుతుంది, ఇందులో ఇద్దరు దొంగల ద్వారా స్థానిక బ్యాంకు నుండి 2 కోట్లు దొంగిలించబడతాయి. అయితే, వారు వారి బాస్ కు డబ్బు ఇవ్వకుండా దానితో పారిపోతారు.వాటాల్లో అపార్ధాలతో ఒకరినొకరు తుపాకీతో కాల్చుకొని చనిపోతారు. కథానాయకుడు చందు తండ్రి జైలులో ఉంటాడు ఆయన గుండెజబ్బుకు డబ్బు అవసరమై చందు చిన్న మోసాలతో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒక రాజకీయనాయకునిద్వారా తండ్రి విడుదల, వైద్యానికి రెండుకోట్లు అవసరమౌతాయి. అక్కడికి వచ్చిన చందు ఆ అవకాసాన్ని ఉపయోగించుకొని డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమాలో కనిపిస్తుంది.
ఇకపోతే అప్పట్లో రిలీజ్ అయినయి సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మళ్లీ స్వామి రారా తరహాలోనే కథాంశాన్ని ఎంచుకున్నాడు అంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు.

ఇకపోతే సుధీర్ వర్మ విషయానికి వస్తే స్వామి రారా సినిమా తర్వాత సుధీర్ వర్మకు ఇప్పటివరకు సరైన హిట్ సినిమా లేదు అని చెప్పొచ్చు. కానీ దోచేయ్ సినిమాలో మాత్రం నాగచైతన్యను చాలా స్టైలిష్ గా చూపించాడు. ఈ సినిమాని కూడా టెక్నికల్ గా బాగా తీశాడు సుధీర్ వర్మ. మళ్లీ వీళ్ళు కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. నేటికీ దోచేయ్ సినిమా వచ్చి దాదాపు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు