Love Me New Release Date : లవ్ మి మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Love Me New Release Date : ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా హారర్ మూవీ లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. నిజానికి మరో రెండు రోజుల్లో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఇంతకీ లవ్ మీ మూవీ ఎప్పుడు థియేటర్లలోకి రాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

కొత్త రిలీజ్ డేట్

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్, వైష్ణవి చైతన్య జంతగా నటిస్తున్న హారర్ రొమాంటిక్ మూవీ లవ్ మీ. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హన్షిత ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండడం విశేషం. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలి అనుకునే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 25న లవ్ మీ మూవీని ను రిలీజ్ చేయబోతున్నట్టుగా తాజాగా ప్రకటించారు. అయితే ఇంతకుముందు ఈ మూవీని ఏప్రిల్ 27న రిలీజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ వాయిదా పడడంతో ఇప్పుడు తాజాగా మేలో మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు.

ఎందుకు వాయిదా పడింది అంటే?

ప్రస్తుతం రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలకు సమ్మర్ బ్యాడ్ సీజన్ గా మారింది. ఐపీఎల్ నడుస్తున్న కారణంగా థియేటర్లోకి సినిమాలు వచ్చినప్పటికీ పెద్దగా వసూళ్లు మాత్రం కలెక్ట్ చేయలేకపోతున్నాయి. అలాగే దీంతో పాటు లవ్ మీ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదని సమాచారం. ఈ రెండు కారణాల వల్ల లవ్ మీ మూవీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీని మరో నెల రోజుల పాటు వాయిదా వేసి మే 25 ను కొత్త రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేశారు.

- Advertisement -

ఆశిష్ కు దెయ్యం అయినా హెల్ప్ చేస్తుందా?

ఆశిష్ ఇంతకుముందే రౌడీ బాయ్స్ మూవీతో దిల్ రాజు అన్న కొడుకుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో గ్రాండ్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ, యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో కమర్షియల్ మూవీ చేసినప్పటికీ పెద్దగా ఆడియన్స్ నుంచి రౌడీ బాయ్స్ మూవీకి రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాతో పాటు సెల్ఫీష్ పేరుతో మరో మూవీ చేస్తున్నాడు ఆశిష్. సెల్ఫిష్ మూవీని సుకుమార్ తో పాటు దిల్ రాజు కూడా కలిసి నిర్మిస్తున్నారు. మరి దయ్యం సినిమా అయినా ఆశిష్ ను  హీరోగా నిలబడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు