Prasanna Vadhanam : హిట్స్ ఉన్నా కూడా బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు

Prasanna Vadhanam : ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ లో మొదటిగా వీడియోలు చేసుకుంటూ ఆ తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. కరోనా టైంలో రిలీజ్ అయిన కలర్ ఫోటో సినిమా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించుకుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వకపోయినా కూడా ఓటీడీలో రిలీజ్ అయిన వెంటనే చాలామంది చూసి ఈ సినిమాపై సోషల్ మీడియా వేదిక ప్రశంసలు కురిపించారు. అక్కడితో సుహాస్ కి హీరో గానే మంచి గుర్తింపు లభించింది. అయితే కలర్ ఫోటో సినిమాకి ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన స్టేటస్ ఉంది అని చెప్పొచ్చు.

కలర్ ఫోటో సినిమా తర్వాత సుహాస్ హీరోగా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి ఛాయ్ బిస్కెట్ సంస్థ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ చేసింది. అలానే ఈ సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడింది అని చెప్పొచ్చు. దర్శకుడు ఒక యూనిక్ కాన్సెప్ట్ ని ఎంచుకొని అందర్నీ ఆకట్టుకునేలా, చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కి హత్తుకునేలా ఈ సినిమాను తెరకెక్కించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. అలానే సుహాస్ కి కూడా మంచి పేరు వచ్చింది.

రైటర్ పద్మభూషణం సినిమా తర్వాత సుహాస్ చేసిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సాధించి మంచి కలెక్షన్స్ను రాబట్టుకుంది. సుహాస్ చేసినవి మూడు సినిమాల అయినా కూడా మంచి హిట్స్ అయ్యాయి. సుహాస్ కి మంచి పేరు రావడంతో పాటు సుహాస్ మార్కెట్ ను కూడా కొంతమేరకు పెంచాయి అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇప్పుడు సుహాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు అంటే చాలామంది ఆ సినిమాపై అంచనాలను పెట్టుకుంటున్నారు. సుహాస్ ఒక నార్మల్ కాన్సెప్ట్ తో సినిమా చేయడు. సుహాస్ ఒక సినిమా చేశాడు అని అంటే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం ఏదో దానిలో ఉంటుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం ఏర్పడింది. అందుకే సుహాస్ సినిమాకి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం సుహాస్ నటిస్తున్న సినిమా ప్రసన్న వదనం.

ఇకపోతే ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సుహాస్ చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన కూడా ఈ సినిమాకి సరిగ్గా బిజినెస్ జరగట్లేదు అనే విషయం తెలుస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరించడానికి రెడీగా ఉంటారు. ప్రసన్న వదనం సినిమాకి సరైన ఓపెనింగ్స్ రాకపోయినా కూడా మౌత్ టాక్ తో సినిమా బాగుంటే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు