SSMB 29 : మహేష్ కు హీరోయిన్ దొరికేసింది… ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

SSMB 29 : దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న SSMB 29 సినిమాకు హీరోయిన్ దొరికేసినట్టు సమాచారం. అయితే ఆమె ఎవరనే విషయం తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. మరి ఇంతకీ SSMB 29లో హీరోయిన్ గా నటించబోయే అదృష్టం ఎవరిని వరించింది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

హీరోయిన్ దొరికేసినట్టేనా?

జక్కన్న ఇప్పటి వరకు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లను పాన్ ఇండియా హీరోలుగా మార్చారు. మొట్టమొదటిసారి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేస్తుండడంతో ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాకముందే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని ఇంకా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ అంటూ పలువురు ఇండియన్ హీరోయిన్లతో పాటు విదేశీ హీరోయిన్ ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే. అలియా, జాన్వి కపూర్ లను హీరోయిన్లుగా అనుకుంటున్నారని రుమార్లు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఒక పంజాబీ సింగర్ ను హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నారట మేకర్స్.

పంజాబీ సింగర్ పై జక్కన్న టీం ఇంట్రెస్ట్

నీరు సెహగల్… ఈ పేరు టాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. కానీ పంజాబీ సింగర్ గా డాన్సర్ గా పంజాబీ మూవీ లవర్స్ కు బాగా తెలుసు. ఈ బ్యూటీ ఇటీవల మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ లో నటించింది. అది చూసిన జక్కన్న టీం SSMB 29లో కూడా ఆమెనే ఫిమేల్ లీడ్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. స్క్రీన్ పై సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా ఈ బ్యూటీ అయితే సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారట. మరి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేస్తారా? లేదంటే వేరే ఆప్షన్స్ వెతుకుతారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ వార్త బయటకు వచ్చాక అసలు ఆ పంజాబీ సింగర్ ఎవరు? అని తెలుసుకోవడానికి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

- Advertisement -

అప్డేట్ రాబోతోంది…

SSMB 29కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం మూవీ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఈ సెట్ వర్క్ జరుగుతుండగా త్వరలోనే టీం సెట్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు అభిమానుల ఎదురు చూపులు ఫలించే రోజు వస్తుందని టాక్ నడుస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగానే ప్రతి ఏడాది మహేష్ బాబు తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ఆనవాయితీగా ఇస్తూ వస్తున్నారు. దాన్ని ఫాలో అవుతూ ఈసారి కూడా రాజమౌళితో చేయబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మే 31న రాబోతోందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు