Spirit Shooting Update : ప్రభాస్ సినిమాపై మళ్లీ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి… ఫ్యాన్స్‌కు ఇక రచ్చ రచ్చే

Spirit : టాలీవుడ్ లో ప్రత్యేక మైన ఇమేజ్ ఉన్న నటుల్లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఎప్పుడైతే అర్జున్ రెడ్డి అనే సినిమా తీసాడో, అప్పట్నుంచి టాలీవుడ్ హీరోలు, నిర్మాతల దృష్టిలో పడ్డాడు సందీప్ రెడ్డి వంగ. పూరి జగన్నాథ్ తర్వాత హీరో కి ఒక డిఫరెంట్ యాంగ్రీ ఇమేజ్ ని తెచ్చిపెట్టే డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒకరని చాలా మంది అంటూ ఉంటారు. దానికి సందీప్ తీసిన సినిమాలే ఉదాహరణ. అర్జున్ రెడ్డి లోగాని, బాలీవుడ్ వెర్షన్ కబీర్ సింగ్ లోగాని, రీసెంట్ గా అనిమల్ లోగాని వంగ హీరోలు చాలా వైలెంట్ గా ప్రత్యేకంగా ఉంటారు. ఒకానొక సమయంలో ఆ హీరోపై కోపం వస్తూనే, తర్వాత దానికి కారణాలు అర్ధం చేసుకుని రియలైజ్ అవుతారు. ప్రతి మనిషిలో ఉండే మరో అనిమల్ సైడ్ ని వంగ తన సినిమాల్లో చూపిస్తాడని అంటారు నెటిజన్లు. అయితే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి తీసిన తర్వాత తెలుగులో యమ బిజీ అవుతాడనుకుంటే బాలీవుడ్ కి వెళ్ళాడు. అక్కడ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి టాలీవుడ్ సత్తా చాటాడు. అక్కడుండే హీరోలకు కూడా సందీప్ తో ఒక్కసారైనా సినిమా చేయాలనీ కోరిక ఏర్పడింది. అయితే సందీప్ తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్నాడని తెలిసిందే.

స్పిరిట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో..

అయితే సందీప్ వంగ అనిమల్ తర్వాత చేయబోయే సినిమా పై ఇండియా వైడ్ గా ఆసక్తి నెలకొని ఉంది. తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ అని తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఐదేళ్ల కిందే ఫిక్స్ అయింది. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ వల్ల కార్యరూపం దాల్చలేదు. ఈ లోపు సందీప్ బాలీవుడ్ లో రెండు సినిమాలు తీసేసాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తోనే తన స్పిరిట్ మొదలు పెట్టనున్నాడు సందీప్ వంగ. ఆ సినిమా స్రిప్ట్ పైనే మొత్తం ఫోకస్ పెట్టగా 80 శాతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యానని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ కాప్ గా కనిపించబోతున్నాడు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూ లో స్పిరిట్ స్టోరీ లైన్ గురించి హింట్ ఇచ్చిన సందీప్ స్పిరిట్ లో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ, “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేదే కథని చెప్పుకొచ్చారు.

ఇయర్ ఎండ్ లో మొదలవుద్ది – సందీప్

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి2898AD , రాజా సాబ్ సినిమాల షూటింగ్ లో ఉన్నాడు. ఇకపోతే తాజాగా సందీప్ వంగ పొట్టెల్ అనే సినిమా టీజర్ లాంచ్ కి గెస్ట్ గా వెళ్లిన సందీప్ వంగ స్పిరిట్ అప్డేట్ ఇచ్చాడు. అక్కడి ఆడియన్స్ ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ ని అడగగా సందీప్ ఒక్క మాటలో ‘ఈ ఇయర్ ఎండ్ లో సినిమా మొదలవుతుంది’ అన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి మూవీ రిలీజ్ అయ్యాకే కొత్త సినిమా మొదలుపెడతాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రాజా సాబ్ మూవీ షూట్ లో పాల్గొంటూ స్పిరిట్ మూవీ స్టార్ట్ చేస్తాడు. అంటే కల్కి రిలీజ్ అయ్యే వరకు స్పిరిట్ నుండి మరే అప్డేట్ వచ్చే ఛాన్స్ లేదన్నమాట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు