Tollywood pan India movie: నార్త్ లో భారీ థియేట్రికల్ బిజినెస్.. హైయెస్ట్ ఆయనే..!

Tollywood pan India movie.. తాజాగా తెలుగు సినిమాల రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయిన విషయం తెలిసిందే. రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాతో పాన్ ఇండియా తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు… ఈ నేపథ్యంలోని తెలుగు సినిమాలకు భారీగా పాపులారిటీ ఏర్పడింది.. ముఖ్యంగా ఇప్పుడు తెలుగులో విడుదలైన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తూ.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోని తెలుగు సినిమాలకు నార్త్ సినీ పరిశ్రమలో భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక అందులో భాగంగానే తెలుగు స్టార్ హీరోస్ అనగానే ముఖ్యంగా ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పేర్లు ప్రథమంగా వినిపిస్తాయి.. వీరు నలుగురు కూడా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.. మరి వీరి సినిమాలకు నార్త్ లో థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది? ఎవరి సినిమా హైయెస్ట్? ఎవరికి నార్త్ లో భారీగా డిమాండ్ ఉంది ? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Tollywood pan India movie:Huge theatrical business in North.. He is the highest..!
Tollywood pan India movie:Huge theatrical business in North.. He is the highest..!

అల్లు అర్జున్ – పుష్ప 2:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేసి నార్త్ లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయారు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం నార్త్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే… ఈ క్రమంలోని అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో మళ్ళీ వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 ను త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తూ ఉండగా… ఈ సినిమాకి నార్త్లో భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఒక నార్త్ లో ఏకంగా రూ.200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

ప్రభాస్ – కల్కి 2898 AD:

సలార్ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 AD.. నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మే 9వ తేదీన విడుదల కానుంది.. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో.. నార్త్లో రూ.100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

- Advertisement -

ఎన్టీఆర్ – దేవర :

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది..ఆర్ఆర్ఆర్ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి నార్త్ లోరూ. 50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

రామ్ చరణ్ – గేమ్ ఛేంజర్:

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కించుకున్న రాంచరణ్ ఇటీవలే గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. అక్టోబర్ 30వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రానికి నార్త్లో రూ.75 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది

మొత్తంగా ఈ లెక్కన చూసుకుంటే నార్త్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రేంజ్ భారీగా ఉన్నట్లు సమాచారం. పుష్ప సినిమాతో భారీగా క్రేజ్ తో పాటు పాపులారిటీ కూడా సొంతం చేసుకున్నారు బన్నీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు