Salaar: ప్రభాస్ నడిపిన బైక్ కావాలా.. అయితే ఇలా చేయండి..!

Salaar: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం సలార్.. ఈ చిత్రం గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కే జి ఎఫ్ తర్వాత మళ్లీ అంతటి హైప్ ఏర్పరిచిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ గా విడుదల చేశారు.. దాదాపుగా రూ.700 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టింది.

Salaar: Do you want the bike that Prabhas rode.. but do this..!
Salaar: Do you want the bike that Prabhas rode.. but do this..!

భారీ డిజాస్టర్ల తర్వాత సక్సెస్ ఇచ్చిన సలార్..

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి సినిమాలు నిరాశపరిచాయి.. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన సలార్ సినిమా మాత్రం ప్రభాస్ కటౌట్ తోనే తన విశ్వరూపాన్ని చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ కైతే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది.. హీరోయిన్ గా శృతిహాసన్ కీలకమైన పాత్రలో నటించగా.. జగపతిబాబు, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించారు. సలార్ సినిమా అటు ఓటీటీలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సలార్ లో ప్రభాస్ నడిపిన బైక్ కావాలంటే..

ఇప్పుడు తాజాగా ఏప్రిల్ 21న బుల్లితెర టీవీలలో ప్రసారం కాబోతోంది. ఆరోజు సాయంత్రం 5:30 నిమిషాలకు ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా లో సలార్ మూవీ ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సలార్ చిత్ర బృందం సినీ ప్రియులకు ఒక బంపర్ ఆఫర్ ని కూడా ప్రకటించింది.. అదేమిటంటే ప్రేక్షకులకు ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తూ.. తమ ట్విట్టర్ నుంచి ఒక ట్విట్ చేసింది. సలార్ చిత్రంలో ప్రభాస్ వాడినటువంటి ఐకానిక్ బైక్ గెలుచుకునే అవకాశం అంటూ పోస్ట్ చేసి అందరిని ఆకట్టుకుంటోంది

- Advertisement -

సలార్ మూవీ లోని బైక్ గెలుచుకునే అవకాశం..

అసలు విషయంలోకి వెళ్తే స్టార్ మా లో సలార్ సినిమా ప్రసారమయ్యే సమయంలో అక్కడ చూపించిన ప్రశ్నలకు ఎవరైనా సరిగ్గా సమాధానం చెబితే ఆ బైక్ గెలుచుకునే అవకాశం ఉంటుంది.. ముఖ్యంగా సాయంత్రం 5:30 నుండి రాత్రి 8 గంటల వరకు చలనచిత్రం సమయంలో స్క్రీన్ ఎడమవైపున బైక్ ఇమేజ్/బగ్ ఎన్నిసార్లు కనిపిస్తుందో మీరు లెక్కించాలి. SMS లైన్‌లు తెరిచినప్పుడు, SALAAR <space> <స్క్రీన్‌పై బైక్ కనిపించిన సమయం>> అని టైప్ చేసి 9222211199కి SMS చేయండి. SMS లైన్ 21 ఏప్రిల్ 2024న రాత్రి 8 గంటల నుండి తెరవబడుతుంది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ కూడా ఒక స్పెషల్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే ఇదంతా కేవలం టిఆర్పి రేటింగ్ కోసమే ప్లాన్ అన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

టీవీలో సత్తా చాటేనా..

థియేటర్లో ఓటీటీ లో సత్తా చాటినటువంటి సలార్ మూవీ ఇప్పుడు టీవీలో ఎలాంటి రేటింగ్స్ సాధిస్తుందో అంటూ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్-2 పై మరిన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి.. అయితే ఈ సినిమా ఇప్పుడే వచ్చేలా కనిపించడం లేదు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజా సాబ్ వంటి చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేసిన తర్వాత సలార్-2 ఉండబోతోందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు