Aadi Saikumar : 12 ఏళ్లలో 17 ప్లాపులు.. హిట్టు కోసం తపన..

Aadi Saikumar : టాలీవుడ్ ఉన్న టాలెంటెడ్ హీరోలలో ఆది సాయి కుమార్ ఒకరు. టాలీవుడ్ లో సినీ బ్యాక్ గ్రౌండ్ తోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ మంచి టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఇండస్ట్రీలో సరిగా నిలదొక్కుకోలేకపోయాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా పద్నాలుగేళ్ల కింద ప్రేమ కావాలి చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టగా, ఆ తర్వాత లవ్లీ తో మరో హిట్టు కొట్టాడు. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటివరకు సక్సెస్ మొహం చూడలేదు ఆది. నటన పరంగా మంచి టాలెంట్ ఉన్నప్పటికీ స్క్రిప్ట్ సెలెక్షన్లలో సరైన కథలు సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల వరుసగా ప్లాపులు అందుకున్నాడు. అలాగే ఆది లాంటి టాలెంటెడ్ నటుడ్ని టాలీవుడ్ దర్శకులు కూడా ఒకరకంగా సరిగా వాడుకోలేకపోయారని చెప్పాలి. అయినా ఆది ఎప్పటికప్పుడు తాను హీరోగా నిరూపించుకోవడనికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

ఏకంగా 17 ప్లాపులు..

అయితే ఆది సాయి కుమార్ కెరీర్ మొదట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్స్ తో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా, తర్వాత కెరీర్ ని అనుకున్న రేంజ్ లో ప్లాన్ చేసుకోలేక ఫ్లాఫ్స్ ను దక్కించుకున్నాడు. కెరీర్ మొదట్లో మంచి హిట్స్ కొట్టి యంగ్ హీరోల్లో మంచి ఫ్యూచర్ ఉంది అనిపించుకున్నప్పటికీ తర్వాత మాత్రం చేసిన సినిమాలు ఒక్కోటిగా తన మార్కెట్ ను పూర్తిగా స్లో డౌన్ చేశాయి. అవి ఎంతలా అంటే ఆది సినిమా మార్కెట్ లో రిలీజ్ అవుతున్నా జనాలకి తెలియనంత. 2012 టైంలో లవ్ లీతో హిట్ కొట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆది ఆల్ మోస్ట్ 18 సినిమాలు చేశాడు. సుకుమారుడు నుండి మొదలుపెడితే ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, గరం, చుట్టాలబ్బాయి, శమంతకమణి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి, అతిధి దేవో భవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో, టాప్ గేర్, CSI సనాతాన్ అంటూ ఆల్ మోస్ట్ 18 సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి. అందులో శమంతకమణి ఓ మోస్తరు గా ఆడగా, అందులో కూడా నలుగురు హీరోల్లో ఒకడిగా కనిపించాడు ఆది.ఇప్పుడైనా ఒక్క హిట్టు కావాలని ఆశగా సమయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి.

వీరభద్రం తో మరోసారి..

ఇక వరుస ప్లాపులతో విసుగెత్తిపోయిన ఆది (Aadi Saikumar ) ఒక్క హిట్టు కోసం తపించిపోతున్నాడు. ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆహానా పెళ్ళంట, పూలరంగడు లాంటి హిట్స్ తర్వాత వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న వీర భద్రం చౌదరి డైరెక్షన్ లో ఆది సినిమా చేయనున్నాడు. ఇక వీళ్ళ కాంబోలో ఇది వరకు చుట్టాలబ్బాయి సినిమా రాగా, ఆ సినిమా పెద్దగా అంచనాలను అందుకోలేదు. 12 ఏళ్లలో 17 ఫ్లాఫ్స్ పడ్డ తర్వాత ఆది సాయి కుమార్ తిరిగి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న టైంలో వీళ్ళ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కి కృష్ణ ఫ్రమ్ బృందావనం అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. అయితే ఈ కాంబో ట్రాక్ రికార్డు ని గమనిస్తే ఆది ఏళ్లపాటు ప్లాపుల్లో ఉండగా, వీరభద్రం కూడా దాదాపు పదేళ్లుగా సక్సెస్ లేక ఎదురుచూస్తున్నాడు. మరి ఈ కాంబోలో బ్లాక్ బస్టర్ కంటెంట్ రాకపోయినా డీసెంట్ సక్సెస్ కొట్టే సినిమా వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు