Sandeep Reddy Vanga : బాలీవుడ్ నటుడికి తన స్టయిల్లో ఇచ్చిపడేసిన వంగ..

Sandeep Reddy Vanga : టాలీవుడ్ సినిమాలు ఒకప్పుడు నార్త్ గీత దాటడానికి చాలా సమయం పట్టేది. కానీ గత పదేళ్ల కాలంలో నార్త్ నుండే కాదు, పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదిగింది. అందునా ఒకప్పుడు టాలీవుడ్ నటీనటులు దర్శకులంటే బాలీవుడ్ లో అంత ఉన్నత భావం ఉండేది కాదు. సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవియే ఓ సందర్భంలో మాట్లాడుతూ బాలీవుడ్ లో ఒక నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్ళినప్పుడు మన తెలుగు లెజెండ్స్ ఫోటోలు లేకపోవడం చూసి బాధపడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడదంతా గతం. ముఖేష్ అంబానీ కొడుకు వేడుకలో ముగ్గురు ఖాన్ త్రయం కలిసి స్టేజి మీద డాన్సు చేయడానికి ఆస్కార్ సాధించిన తెలుగు పాట నాటు నాటునే కావాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ సందు దొరికినప్పుడల్లా రాజమౌళికి కౌంటర్ వేయడానికి దిగుతూనే ఉంటారు బాలీవుడ్ క్రిటిక్స్. రాజమౌళి మీదున్న ఒకరకమైన అక్కసు ఇప్పుడు తగ్గిని కానీ, బాహుబలి వచ్చిన కొత్తలో బాగానే చూపించేవాళ్ళు. ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా కూడా రాజమౌళి మాదిరే పదే పదే లక్ష్యంగా మారుతున్నాడు.

కబీర్ సింగ్ నటుడి ఓవరాక్షన్..

ఇక అసలు విషయయానికి వస్తే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ చదివే మెడికల్ కాలేజీ డీన్ గా నటించిన వ్యక్తి ఆదిల్ హుసేన్. ఇతనికి తక్కువ సీన్లు ఉంటాయి. అయితే ఇటీవలే జరిగిన ఒక రేడియో టాక్ షోలో ఆదిల్ మాట్లాడుతూ కబీర్ సింగ్ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని, షూటింగ్ కు వెళ్లకుండా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తే అదీ ఇచ్చారని, అందువల్ల చేయక తప్పలేదని అన్నాడు. అక్కడితో ఆగకుండా తెరమీద కబీర్ సింగ్ చూస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని కాస్త మోతాదు మించే ఓవరాక్షన్ చేశాడని, రొమాన్స్ కి గాని, ఆ వైలెన్స్ కి గాని నిజానికి ఆయన క్యారెక్టర్ లెన్త్ కి ఇంత అవసరం లేదని అన్నాడు. అయితే దీనికి సందీప్ రెడ్డి వంగ గట్టి కౌంటర్ వేసాడు.

స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేసిన వంగ..

అయితే ఆదిల్ హుసేన్ మాటలకు సందీప్ వంగా(Sandeep Reddy Vanga) ట్విట్టర్ నుండి ఘాటుగా బదులిస్తూ కౌంటర్ వేయడం జరిగింది. 30 ఆర్ట్ సినిమాలు తీసుకురాని పేరు ఒక్క బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు బాధ పడటంలో తప్పు లేదని, నటన పట్ల ప్యాషన్ కన్నా దురాశే కనిపిస్తోందని చురకలు వేశాడు. ఇప్పటికైనా మించిపోలేదని ఏఐ టెక్నాలజీ వాడి నీ మొహాన్ని మారుస్తానని ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. అయితే ఈ సందీప్ పై ఇప్పుడే కాదు కబీర్ సింగ్ రిలీజైన టైంలోనూ కొందరు హిందీ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇచ్చి నెగటివ్ రివ్యూలు రాశారు. ఆడియన్స్ మద్దతుతో ఆ సినిమా ఏకంగా మూడు వందల కోట్లు సాధించింది. క రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ మీద ఎన్ని డిబేట్లు జరిగాయో చూశాం. దీనికంటే పది రెట్లు దారుణమైన సినిమాలు తీసిన బాలీవుడ్ మేకర్స్ కి సందీప్ వంగ పట్ల ఇదేం ఏడుపో అర్ధం కావట్లేదని టాలీవుడ్ ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ బాలీవుడ్ ని మించిపోతుంటే ఇలాంటివి సహజమేనని మనోళ్లే లైట్ తీసుకుంటున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు