Varun Tej : రెమ్యూనరేషన్ తగ్గించబోతున్న మెగా హీరో.. అదే కారణం?

Varun Tej : టాలీవుడ్ లో ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో తనదైన ముద్ర వేసిన మెగా హీరో వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం తపిస్తున్నాడు. అసలు ఒకానొక సమయంలో వరుణ్ తేజ్ కి మెగా హీరోల్లోనే ప్రత్యేక శైలి ఉండేది. మొదటి సినిమా తోనే పరిణితి చెందిన నటనని కనబరచిన వరుణ్, ఆ తర్వాత రొటీన్ సినిమాలకి పెద్దగా పోకుండా కంచె, అంతరిక్షం, ఫిదా లాంటి డిఫరెంట్ జోనర్ లో మూవీ తీసాడు. అప్పుడప్పుడు కొన్ని నిరాశ పరిచినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఆ మధ్య వరుసగా మంచి సూపర్ హిట్ సినిమాలు కొట్టిన వరుణ్ లాక్ డౌన్ తర్వాత మొత్తం డౌన్ అయ్యాడని చెప్పాలి. చివరగా సోలో హీరోగా గద్దల కొండ గణేష్ తో హిట్ కొట్టిన వరుణ్, ఆ తర్వాత వెంకీ తో కలిసి F3 తో ఓ మోస్తరు యావరేజ్ సినిమా అందుకున్నాడు. కానీ ఈ మధ్య చేసిన గాండీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి.

రెమ్యూనరేషన్ తక్కువైనా పర్లేదు..

అయితే గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటున్న వరుణ్ తేజ్(Varun Tej) కి ఇప్పుడు భారీ హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తాను రీసెంట్ గా చేసిన సినిమాలు కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయాయి. పైగా ఈ సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్లలో భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. దాని వల్ల నిర్మాతలకు చాలా నష్టం వచ్చింది. అందుకే వరుణ్ తేజ్ ఎప్పుడూ లేనట్టు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోవడానికి రెడీ అయ్యాడు. మొన్న మొన్నటివరకు సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే వరుణ్ ఇకపై 6 నుండి 7 కోట్ల లోపే తీసుకోవాలని చూస్తున్నాడట. వీలైతే ప్రాఫిట్ లో షేర్ తీసుకుందామని చూస్తున్నాడట. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ ముఖ్యం. బహుశా ముందు ముందు వరుసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రెమ్యూనరేషన్ పెంచడం గురించి అప్పుడు ఆలోచించొచ్చేమో.

ఇక పై కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ కే ప్రాధాన్యం..

ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ వరుసగా సీరియస్ డ్రామాలు, హెవీ డ్యూటీ యాక్షన్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమాల వల్ల వరుణ్ తేజ్ కి ఒరిగిందేమి లేదు. అందువల్ల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడున్న పరిస్థితులలో మంచి ఎంటెర్టైనింగ్ మూవీస్ చేయాలని చూస్తున్నాడని తెలుస్తుంది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో మెగా హీరోలకి రెగ్యులర్ గా సక్సెస్ లు వస్తూ ఉంటాయి కాబట్టి, వరుణ్ తేజ్ ఈ నిర్ణయం తీసుకుంటే మంచిదేనని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇదే చట్రం లో ఉండకుండా అప్పుడప్పుడూ డిఫరెంట్ కథాంశం ఉన్న చిత్రాలు కూడా చేస్తే మంచిదని నెటిజన్లు అంటున్నాడు. ఇక వరుస ఫ్లాప్స్ తో తన మార్కెట్ కు బాగా గండి పడడంతో పారితోషికం తగ్గించుకున్న వరుణ్ రాబోయే సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? టాలీవుడ్ లో తన ఇమేజ్ ని కాపాడుకుంటాడా లేదా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు