Sekhar master: అన్నయ్య మూవీకి పిలుపురాలేదా లేక పట్టించుకోలేదా..?

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట , త్రిష కాంబినేషన్లో వస్తున్న విశ్వంభర సినిమా పై ఏ రేంజ్ లో హైప్స్ నెలకొన్నాయో తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా సెరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు కీరవాణి అద్భుతంగా పాటలను రికార్డు చేస్తున్నారు.. అయితే ఈ పాటలకు డైరెక్టర్ వశిష్ట ఎంచుకున్న కొరియోగ్రాఫర్లను చూస్తే కచ్చితంగా ఈ సాంగ్స్ ని ఏ విధంగా డిజైన్ చేశారో మనకు అర్థమవుతుంది.. విజయ్ బిన్నీ తో ఒక సాంగ్ ను పూర్తి చేశారట.. ఆ తర్వాత శోభి మాస్టర్ తో మరొక సాంగ్ ను పూర్తి చేశారట… ఇలా వరుసగా పాటలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తున్నది.

శేఖర్ మాస్టర్..
సాధారణంగా అయితే ఈమధ్య చిరంజీవి సినిమా పాటలు అంటే కచ్చితంగా శేఖర్ మాస్టర్ మాత్రమే కంపోజ్ చేస్తున్నారు. అయితే అవే రొటీన్ స్టెప్పులు బోర్ కొట్టడంతో ఈసారి శేఖర్ మాస్టర్ కు అన్ని పాటలను అప్పగించలేదన్నట్లు సమాచారం.. అంతేకాదు కనీసం ఒక సాంగ్ అయినా శేఖర్ మాస్టర్ కి ఇస్తారా లేదా అనే సందిగ్ధత అభిమానులలో నెలకొంది.. ఇప్పటివరకు వస్తున్న సమాచారం మేరకు శేఖర్ మాస్టర్ కు విశ్వంభర చిత్రం నుంచి ఎలాంటి పిలుపు రాలేదని సమాచారం. మొత్తానికైతే రొటీన్ స్టెప్స్ కారణంగా అన్నయ్య సినిమాలో శేఖర్ మాస్టర్ ఛాన్స్ పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా పాటల చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే..

జానీ మాస్టర్ కోసం ఫ్యాన్స్..
జానీ మాస్టర్ చేత ఒక పాటను కంపోజ్ చేసే విధంగా చూడాలని అభిమానులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. విశ్వంభర చిత్రంలో పాటలు కాస్త ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక వీటిలో శేఖర్ మాస్టర్ ,జానీ మాస్టర్లకు ఏదైనా ఆఫర్ ఇస్తారేమో చూడాలి.

- Advertisement -

విశ్వంభర కోసం డైరక్టర్ ప్లాన్..
సోషియో ఫాంటసీ కథాంశంతో విశ్వంభర సినిమాని డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు..విశ్వంభర సినిమా కోసం డైరెక్టర్ వశిష్ట ఒక సరికొత్త ప్రపంచాన్ని కూడా సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. భారీ క్యాస్టింగ్ తో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. అంతేకాదు జనవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నామంటూ డేట్ కూడా లాక్ చేశారు… మరి అనుకున్న సమయానికి సినిమాని విడుదల చేస్తారో లేదో చూడాలి.

చిరంజీవి సినిమాలు..
చివరిగా భోళా శంకర్ చిత్రంతో భారీ డిజాస్టర్ అందుకున్న చిరంజీవి.. ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. మరొకసారి చిరంజీవి తన మార్క్ యాక్షన్ తో విశ్వంభర సినిమాని సక్సెస్ చేస్తారా లేదా చూడాలి మరి.. ఇక ఈ సినిమా తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి చిరంజీవి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం..

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు