Sujeeth : డీపీ మార్చిన “ఓజీ” డైరెక్టర్… పవన్ తో కొత్త పిక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ “ఓజి” డైరెక్టర్ సుజీత్ ఇన్స్టా డీపీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న ఆ తాజా పిక్ తో ఈ యంగ్ డైరెక్టర్ మెగా ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చినట్టు అయ్యింది. పవర్ స్టార్ అభిమానులు చాలాకాలంగా “ఓజి” మూవీ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే సుజీత్ వల్ల వాళ్ళ ఎదురు చూపులకు కాస్త ఊరట లభించింది.

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “ఓజీ”. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఓజీ” మూవీని డివివి దానయ్య నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను డివివి ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. “ఓజీ” మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రాబోతోందని, పవన్ కళ్యాణ్ కారు పక్కన నిలబడి చాయ్ గ్లాస్ పట్టుకుని స్టైలిష్ గా కనిపిస్తున్న ఫోటోను షేర్ చేసింది.

గతంలో పవన్ “అత్తారింటికి దారేది” సినిమా కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు “ఓజీ” విషయంలో మేకర్స్ అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఉండడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తిరిగి రాగానే జెట్ స్పీడ్ తో “ఓజీ” సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సుజిత్ మెగా అభిమానుల కోసం మంచి స్టఫ్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన స్టైలిష్ పిక్ ను తన ఇంస్టాగ్రామ్ డీపీగా సెట్ చేసుకున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ పిక్ లో సుజిత్ భుజంపై పవన్ కళ్యాణ్ చేయి వేసి కనిపిస్తున్నారు. సుజిత్ సెట్ చేసుకున్న ఈ డీపీ ప్రస్తుతం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. ఇక భారీ అంచనాలతో రూపొందుతున్న “ఓజీ” సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. 1950లో బ్యాక్ డ్రాప్ లో ముంబై గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు