Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు భారీ షాక్.. చివరి సినిమా అదే..!

Pawan Kalyan

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్ పరంగా ఇటు సినిమాల పరంగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండడంతో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరీ ఫోకస్ అంతా కూడా ఎలక్షన్ మీదే పెట్టారు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఒక నాలుగు నెలల పాటు తన సినిమాలకు దూరంగా ఉంటూ ఎలక్షన్స్ ముగిసిన వెంటనే కమిట్ అయిన చిత్రాలను పూర్తిచేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

ఇటీవలే డైరెక్టర్ అట్లీతో కూడా ఒక సినిమా కమిట్ అయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా తాజాగా అభిమానులకు షాక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు గెలిస్తే ఇక సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం కనుక నిజమైతే డైరెక్టర్ అట్లీతో చేసే సినిమానే చివరి సినిమా అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోని పవన్ కళ్యాణ్ ఎంతవరకు అటు సినిమాలని ఇటు రాజకీయాలని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తారనే డౌట్లు కూడా అభిమానులలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో OG, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ తదితర చిత్రాల సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉన్నది. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ సినిమాలను పూర్తి చేసే ఆలోచన లో వున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా అయిపోయిన వెంటనే చివరిగా డైరెక్టర్ అట్లీతో సినిమా తీసి సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన ఫుల్ ఫోకస్ అంతా కూడా పొలిటికల్ వైపే వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితుల వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

మరి పవన్ కళ్యాణ్ కెరియర్ అంతా కూడా వచ్చే ఎలక్షన్స్ మీద ఆధారపడిందని చెప్పవచ్చు. గత ఎడారి పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. భారీ అంచనాల మధ్య OG సినిమాని ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు. మరి ఏ మేరకు అభిమానులను ఈ సినిమా మెప్పిస్తుందో చూడాలి.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు