Yatra 2 Twitter Review : యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ

Yatra 2 Twitter Review

త్వరలో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ సందడి మొదలైపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లో పొలిటికల్ ఎజెండాతో తెరకెక్కుతున్న సినిమాలు రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ ట్రెండును ఫాలో అవుతూ పొలిటికల్ జోనర్ లో వచ్చిన తాజా మూవీ “యాత్ర 2”. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ గురువారం రోజు థియేటర్లలోకి వచ్చింది. మహి వి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు. ఏపీ సీఎం జగన్ సతీమణి భారతి పాత్రను కేతకి నారాయణన్ పోషించారు. మరి గతంలో వచ్చిన యాత్ర మూవీకి సీక్వెల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “యాత్ర 2” మూవీ ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? అనే విషయంలోకి వెళ్తే…

“యాత్ర 2” మూవీలో పొలిటికల్ గా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకు పడకుండా, రాజకీయ కోణాలను టార్గెట్ చేయకుండా రూపొందించారు. ఒక కొడుకు తన తండ్రికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టాడు అన్న విషయాన్ని డైరెక్టర్ “యాత్ర 2″లో ఎఫెక్టివ్ గా చూపించాడని అంటున్నారు. సినిమాలో అసలు లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారి ప్రస్తావన ఉండదని చెబుతున్నారు నెటిజన్లు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఎమోషనల్ గా, ఆయన జీవితంలో జరిగిన పలు అంశాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక జగన్ పాత్రలో నటించిన జీవాను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. పర్ఫెక్ట్ గా జగన్ మేనరిజంనీ, బాడీ లాంగ్వేజ్ ని జీవా ఫాలో అయ్యాడని, జగన్ పాత్రలో జీవా జీవించాడని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎమోషనల్ సీన్స్ కంటతడి పెట్టిస్తాయని, సినిమాలో ఉన్న పవర్ ఫుల్ డైలాగులు థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని జగన్ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక చివరగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే ఎపిసోడ్ ఇంటెన్స్ సీన్ తో సినిమా ఎండ్ అవుతుందని అంటున్నారు.

మొత్తానికి “యాత్ర 2″లో నెగిటివ్ అంశాలను పక్కన పెట్టేసి, జగన్ లోని పాజిటివ్ కోణాన్ని మాత్రమే ప్రజలకు చూపించారు. ఇదే విషయాన్ని కొంతమంది నెటిజన్లు ఎత్తి చూపిస్తున్నారు. మనిషన్నాక ప్రతి ఒక్కరిలోనూ కొంత మంచి, కొంత చెడు ఉంటుంది. కానీ సినిమాలో జగన్ ను పూర్తిగా పాజిటివ్ గా చూపించడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది సినిమాలో నిజం ఎంత అబద్ధం ఎంత? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది సినిమాలో చాలా వరకు నిజాలను దాచి పెట్టారని ట్వీట్స్ వేస్తున్నారు. అసలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే కంప్లీట్ రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు