Valentine’s Night on OTT : ఓటిటిలో వాలెంటైన్స్ నైట్… ఎలా ఉందంటే?

30 వెడ్స్ 20 వెబ్ సిరీస్ తో నటుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్న నటుడు చైతన్యరావు. ఆయన హీరోగా నటించిన మూవీ “వాలెంటైన్స్ నైట్”. లావణ్య, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. అనిల్ గోపిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుందా? అనే వివరాల్లోకి వెళ్తే…

గత ఏడాది రిలీజ్ అయిన “వాలెంటైన్స్ నైట్” మూవీ చాలా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. ఈరోజు నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ,”వాలెంటెన్స్ నైట్” కథ విషయానికి వస్తే… ఆర్జేగా పనిచేసే అజయ్, ప్రియ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ఫ్యామిలీ కోసం ప్రియకు అజయ్ బ్రేకప్ చెప్పేస్తాడు. మరోవైపు సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా రాణిస్తున్న రాఘవ తన వ్యాపార పనుల్లో పడి భార్య మాయ, కూతురు వేదను నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో డ్రగ్స్ బానిసగా మారిన వేద రాహుల్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది.

ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీకి ఓ సమస్య ఎదురు కాగా, దాంట్లో నుంచి బయటపడడానికి మాయ తన స్నేహితుడు మ్యాడి హెల్ప్ అడుగుతుంది. ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ కృష్ణమోహన్ కు డ్రగ్స్ పెడ్లర్ అలీ దొరికిపోతాడు. ఇంతకీ ఈ డ్రగ్స్ దందా దాదా ఎవరు? ప్రేమిస్తున్న రాహుల్ వల్ల వేదకు ఎలాంటి సమస్య ఎదురయింది? డ్రగ్స్ కేసును కృష్ణమోహన్ ఏం చేశాడు? అజయ్, ప్రియా మళ్ళీ కలుసుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే “వాలెంటైన్స్ నైట్” మూవీని చూడాల్సిందే.

- Advertisement -

అయితే ముందుగా టైటిల్ చూసిన సినీ ప్రియులకు ఇదొక రొమాంటిక్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ దర్శకుడు మాత్రం వాళ్ళ ఆశను నిరాశ చేస్తాడు. నిజానికి ఈ మూవీ బిజీ లైఫ్ కారణంగా కుటుంబానికి సమయాన్ని కేటాయించలేని తల్లిదండ్రులు, వాళ్ళు ఇచ్చే మితిమీరిన స్వేచ్ఛ వల్ల పిల్లలు ఎలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు? తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే సందేశాన్ని డైరెక్టర్ అనిల్ గోపిరెడ్డి ఈ సినిమా ద్వారా చూపించాలనుకున్నారు. ఒక్క నైట్ లో అందరి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది చూపించారు. అయితే పాయింట్ బాగున్నప్పటికీ డైరెక్టర్ కథను ఆవిష్కరించడంలో తడబడ్డాడు. కథ చాలా నిదానంగా సాగుతుంది. బోల్డ్ సన్నివేశాలు హద్దులు దాటడం చిరాకు పుట్టిస్తుంది. నటీనటులు పర్వాలేదనిపించారు. మొత్తానికి ఈ కథతో డైరెక్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు