Akshay Kumar: ఎట్టకేలకు అక్షయ్ భారతీయుడనిపించుకున్నాడు!

Akshay kumar

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. లాక్ డౌన్ కి ముందు ఈ స్టార్ హీరో నటించిన ఏ సినిమా అయినా 100కోట్ల క్లబ్ లో చేరిపోయి మంచి సక్సెస్ కూడా అయ్యేవి. అయితే గత రెండేళ్లుగా మాత్రం అక్షయ్ కుమార్ నటించిన అన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. దాదాపు 6 డిజాస్టర్లు అందుకున్నాడు.

ఇక తాజాగా OMG2 తో ఫైనల్ గా హిట్ కొట్టాడు. OMG కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఇదిలా ఉండగా అక్షయ్ కుమార్ కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఒక ట్రోలింగ్ కి ఈరోజు చెక్ పెట్టాడు. అదేంటంటే అక్షయ్ కుమార్ పేరుకి ఇండియన్ అయినా, తాను కెనడియన్ సిటిజన్ గానే లీగల్ గా కొనసాగుతున్నాడు.

కారణాలేంటో తెలియదు గాని ఆయన చాలా ఏళ్లుగా కెనడియన్ సిటిజన్ గానే ఉన్నాడు. అయితే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా పౌరసత్వాన్ని రద్దు చేసుకుని తిరిగి భారత పౌరసత్వాన్ని తీసుకున్నారు.

- Advertisement -

ఈ విషయాన్నీ అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది. ఇక నుంచి నా గుండె పౌరసత్వం కూడా రెండూ స్వదేశీవే అంటూ సంతోషంగా కేంద్రం ఇచ్చిన సర్టిఫికెట్ ని చుపిస్తూ ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఈ ట్వీట్ తో అక్షయ్ ఇండియన్ కాదు అంటున్న విమర్శకుల నోళ్లు మూతబడ్డాయని చెప్పవచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు