OMG2: ఆ సినిమా నాస్తికుడి కోణంలో.. ఈ సినిమా ఆస్తికుడి కోణంలో

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన “ఓ మై గాడ్” ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. విలక్షణ నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో అక్షయ్ కుమార్ ప్రత్యేక పాత్రలో నటించిన ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు హీరోలుగా “గోపాల గోపాల” పేరుతో రూపొందింది.

అయితే ఇప్పుడు OMG కి సీక్వెల్ గా సినిమా వస్తుంది. ఫస్ట్ పార్ట్ లో నటించిన అక్షయ్ కుమారే ఇందులోనూ నటించగా, ఇతర నటీనటులు మాత్రం చేంజ్ అయ్యారు. తాజాగా విడుదలైన ఈ “OMG 2” టీజర్ మంచి స్పందన రాబట్టుకుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో విష్ణువు గా గాడ్ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి ప్రతిరూపం గా కనిపించనున్నాడు.

అయితే మొదటి పార్ట్ లో పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటించగా, అందులో అతను నాస్థికుడుగా నటించడం జరిగింది. ఇక రెండో భాగంలో మీర్జాపూర్ సీరిస్ ద్వారా ఫేమస్ అయిన పంకజ్ త్రిపాఠి మెయిన్ లీడ్ లో నటించాడు. అయితే ఈ సినిమాలో ఇతడు ఆస్థికుడు గా నటిస్తున్నాడని టీజర్ లో చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ పార్ట్ నాస్తికుడి కోణంలో సాగితే, సెకండ్ పార్ట్ ఆస్తికుడి కోణంలో సాగుతుందన్నమాట.

- Advertisement -

ఇక OMG కి ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించగా, సెకండ్ పార్ట్ కి అమిత్ రాయ్ దర్శకత్వం వహించాడు. ఇక OMG2 లో లాయర్ గా కీలకపాత్రలో యామి గౌతమ్ నటించగా, ఓల్డ్ “రామాయణ్” సీరియల్ హీరో “అరుణ్ గోవిల్” ఈ సినిమాలో “లార్డ్ రామ” గా స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడని చిత్రవర్గం నుండి సమాచారం. ఇక OMG2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు11 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు