Bhagavanth Kesari Movie: హరికృష్ణ మూవీకి రీమేక్… నిర్మాతలు క్లారిటీ

Bhagavanth Kesari Movie

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాకి సంబంధించిన కొన్ని రూమర్స్ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎక్కువ పాపులర్ అయిన రూమర్ ఏదంటే భగవంత్ కేసరి సినిమా గతంలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించిన ఒక సూపర్ హిట్ సినిమాకి రీమేక్ అని వార్తలు వచ్చాయి.

అయితే ఈ న్యూస్ చాలా వరకు పాపులర్ అయ్యి భగవంత్ కేసరి సినిమాపై నెగిటివికి కారణమైంది దాంతో ఇక ఆ వార్తల పైన భగవంత్ కేసరి మూవీ యూనిట్ స్పందించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా గురించి అందరికి తెలిసిందే.

యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలనే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ షూటింగ్ పార్ట్ కూడా ఇటీవలనే కంప్లిట్ చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా భగవంత్ కేసరి సినిమా.. గతంలో నందమూరి హరికృష్ణ నటించిన స్వామి సినిమా కు రీమేక్ అంటూ కొంత మంది రూమర్స్ క్రియేట్ చేసారు.

- Advertisement -

కాగా భగవంత్ కేసరి సినిమాకు సంబందించి రిలీజ్ చేసిన పోస్టర్స్ కూడా దాదాపు స్వామి సినిమా పోస్టర్స్ ను తలపించేలా ఉండేసరికి ఈ వార్త నిజమేనని సోషల్ మీడియాలో ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. దాంతో మూవీ టీం ఈ రూమర్ పై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో భగవంత్ కేసరి సినిమాపై వచ్చే రూమర్స్ లో ఎటువంటి నిజం లేదంటు షైన్ స్క్రీన్ బ్యానర్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

దాంతో ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్ అన్నింటికీ చెక్ పడింది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు