Director Nelson Interview : జైలర్ పార్ట్ 2 పై డైరెక్టర్ నెల్సన్ వ్యాఖ్యలు ట్రేండింగ్

Director Nelson Interview

సూపర్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జైలర్ గురించి అందరికి తెలిసిందే. డార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్ట్ 10న థియేటర్స్ లో విడుదలై విజయవంతంగా ప్రదర్షింపబడుతుంది. ఈ సినిమా రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించి, ప్రస్తుతం బ్లాక్ బస్టర్ సినిమా దిశగా అడుగులు వేస్తోంది ఈ సందర్భంగా జైలర్ సినిమా డైరెక్టర్ నెల్సన్ జైలర్ సినిమాకు పార్ట్ 2 పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం జైలర్ పార్ట్ 2 న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన జైలర్ సినిమాలో రమ్య కృష్ణ, తమన్నా, మిర్న మీనన్, సునీల్ ప్రధాన పాత్రలలో నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ జైలర్ సినిమాకు సంగీతం అందించారు. ఒక పక్క తెలుగు రాష్టాలలో మెగా స్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ ఉన్న కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జైలర్ సినిమాను ఆగస్ట్ 10న రిలీజ్ చేసారు. వింటేజ్ రజనీకాంత్ లుక్స్, అనిరుధ్ మ్యూజిక్ మేజర్ ప్లస్ అవ్వగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక జైలర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నెల్సన్ ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనగా ఆయన జైలర్ సినిమాకు పార్ట్ 2 చేయాలనుందని వెల్లడించారు. అలాగే తన గత చిత్రాలైన బీస్ట్, డాక్టర్, కోలమావు కోయిల చిత్రాలకు కూడా సెకండ్ పార్ట్ చేయాలనుందని తన మనసులో మాట బయట పెట్టారు. అలాగే ఆయనకు తలపతి విజయ్ మరియు రజనీకాంత్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడం తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ అయన చెప్పుకొచ్చాడు. మరీ ఈ సినిమాల్లో ఏది నెల్సన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు