Vijay Devarakonda: ఫ్యామిలీ స్టార్ లో మరో హీరోయిన్..!

Vijay Devarakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్లో ఫామిలీ స్టార్ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమం జరుపుకున్న సంగతి తెలిసిందే. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి 2024 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది.

పరశురామ్ కి గీతా ఆర్ట్స్ తో ఉన్న ఫైనాన్సియల్ డిఫరెన్సెస్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అన్న అనుమానాలు ఉండేవి మొదట్లో. అయితే, దిల్ రాజు సీన్లోకి ఎంటరై ఇష్యూ సాల్వ్ చేసి సినిమాకు లైన్ క్లియర్ చేశాడు. దీంతో పెద్దగా ఆసక్తి లేని ఈ సినిమాపై హోప్స్ పెరిగాయి.

విజయ్,పరశురామ్ కాంబినేషన్లో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఉండటం, సీతారామం సినిమాతో తెలుగు ఆడియెన్స్ మది దోచుకున్న మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అవ్వటంతో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ సరసన మరో హీరోయిన్ కనిపించనుందని తెలుస్తోంది.

- Advertisement -

మజిలీ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం అందుతోంది. మజిలీ సినిమా ద్వారా పర్వాలేదని అనిపించినా తర్వాత చేసిన సినిమాలు ఏవీ పెద్దగా హిట్ అవ్వకపోవటం వల్ల దివ్యాంశకి పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు.

విజయ్ దేవరకొండ ఎన్నో హోప్స్ పెట్టుకున్న లైగర్ సినిమా డిజాస్టర్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాగా, విజయ్ సమంతల మధ్య కెమిస్ట్రీ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

సర్కారు వారి పాట సినిమా ద్వారా హిట్ అనుకున్నప్పటికీ అల్లు అరవింద్ సహా పలువురు నిర్మాతలతో నెలకొన్న వివాదాల వల్ల నెగిటివిటి మూట కట్టుకున్న పరశురామ్ ఫ్యామిలీ స్టార్ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు