VD13: విజయ్ – పరశురామ్ సినిమా టైటిల్ ఇదేనా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ డైరెక్షన్లో రూపొందనున్న సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ కి నిర్మాతలకి మధ్య నెలకొన్న అడ్వాన్స్ వివాదం ఓ కొలిక్కి రావటంతో ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభం అయ్యింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా టైటిల్ విషయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. ఈ సినిమాకు ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫిక్స్ చేశారని, ‘కుటుంబ రావ్’ అన్నది ట్యాగ్ లైన్ అని టాక్ వినిపిస్తోంది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ సమంతతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్ధమవుతుండగా, ఆ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలయ్యే అవకాశం ఉంది.

విజయ్ – పరశురామ్ కాంబినేషన్లో గతంలో గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఉండటం, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అవ్వటం, దిల్ రాజు నిర్మాత అవ్వటం ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న లైగర్ సినిమా డిజాస్టర్ అవ్వటం వల్ల రాబోయే ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత అంతటి రేంజ్ హిట్ లేని విజయ్ కెరీర్ కి లైగర్ సినిమా పెద్ద డ్యామేజ్ చేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో విజయ్ కి పరశురామ్ డైరెక్షన్లో చేయబోయే సినిమా గీత గోవిందం రేంజ్ బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు