Sandeep Reddy Vanga : ఆ సినిమాని సందీప్ ను రీమేక్ చెయ్యొచ్చు

  • తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రమే మొదటి సినిమాతో తమదైన ముద్రను వేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంటారు. శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటివరకు డైరెక్టర్లకి అంతగా పేరు రాని తరుణంలో డైరెక్టర్లు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చిన డైరెక్టర్ అంటే రామ్ గోపాల్ వర్మ అని చెప్పొచ్చు. శివ సినిమా తర్వాత చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ అందరూ కూడా వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్స్ చింపేశారు.

అంత గొప్పగా శివ సినిమాను తెరకెక్కించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక మార్కుని సెట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ సెట్ చేసిన ఆ మార్క్ ను అందుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది చాలామంది దర్శకులకి. అంతటి ఇంపాక్ట్ ను ఇచ్చే సినిమాను ఏ దర్శకుడు కొంతకాలం పాటు చేయలేకపోయారు.

అయితే 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు. అప్పట్లో శివ సినిమా తర్వాత అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది అర్జున్ రెడ్డి సినిమా. ఆ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సినిమా టెక్నికల్ తో పాటు చాలా యాస్పెక్ట్స్ లో ఆడియన్స్ ని ఫిదా చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన దర్శకుడు దొరికాడు అనే ఫీల్ ని క్రియేట్ చేసింది.

ఆ సినిమా తర్వాత డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాని అక్కడ కబీర్ సింగ్ గా తెరకెక్కించి మంచి ఘనవిజయాన్ని సాధించాడు. అయితే కబీర్ సింగ్ సినిమాకి చాలా తక్కువగా రేటింగ్స్ ఇచ్చారు అక్కడ వెబ్సైట్ వాళ్ళు. కానీ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాకి దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ను అంటగట్టారు.

- Advertisement -

అయితే సందీప్ రెడ్డి తీసిన ఈ సినిమాను వైలెంట్ ఫిల్మ్ అని చాలామంది రాస్కొచ్చారు. అప్పుడు సందీప్ పాస్ చేసిన స్టేట్మెంట్ ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. నా సినిమాను వీళ్ళు వైలంట్ ఫీల్మన్నారు. అసలు వైలెంట్ ఫిల్మ్ అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ రన్బీర్ కపూర్ తో అనిమల్ సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ.

ఇక యానిమల్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 1000 కోట్లు పైగా వసూలు చేసింది ఆ సినిమా. సందీప్ రెడ్డిని ఒక బ్రాండ్ డైరెక్టర్ గా మార్చింది. ఇకపోతే డైరెక్టర్ పర్సనల్ లైఫ్ మీద కూడా కొంతమంది దృష్టి పెట్టడం మొదలు పెడతారు.

సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు చూసినా కూడా లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు. చాలా ఇంటర్వ్యూస్ లో సందీప్ రెడ్డివంగా తన హెయిర్ ముడి పెట్టుకుని మరీ కనిపించారు. అయితే రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందీప్ రెడ్డి గుండు కొట్టించుకున్నారు. అయితే ఈ లుక్ మొన్నటి వరకు ట్విట్టర్ లో వైరల్ గా మారింది. అయితే సందీప్ రెడ్డి వంగ మూడు పిక్స్ ను పక్కపక్కన పెట్టి అపరిచితుడు సినిమాలోని రాము,రెమో అపరిచితుడుగా చాలామంది పేర్కొన్నారు. కొంతమంది సందీప్ రెడ్డి వంగాను పెట్టి ఈ సినిమాకి సీక్వెల్ చేయొచ్చు అంటూ కొన్ని కామెంట్స్ కూడా వినిపించారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు