Rajamouli: ఊహకందని ప్లాన్ చేసిన జక్కన

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో టాప్ పొజిషన్ లో ఉన్న దర్శకుడు అంటే ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాకుండా భారతీయ సినిమాలో ఉన్న దర్శకులలో మొదటి ప్లేస్ లో ఎవరున్నారు అని అడగగానే టక్కని చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఎందుకంటే తెలుగు సినిమాతో ప్రపంచ సినిమా పైన అంతటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన ఏకైక దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.

శాంతి నివాసం అనే సీరియల్ కి దర్శకుడుగా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమాకి దర్శకుడుగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక గొప్ప దర్శకుడు దొరికాడు అనే ఫీల్ ని క్రియేట్ చేసాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ ను స్టార్ ను చేసిన సినిమా సింహాద్రి అని కూడా చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించాడు రాజమౌళి.

ఆ తర్వాత నితిన్ హీరోగా చేసిన సై సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను తెరకెక్కించి ఆడియన్స్ ని మెప్పించాడు రాజమౌళి. ఆ తర్వాత రాజమౌళి చేసిన యమదొంగ , విక్రమార్కుడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. రామ్ చరణ్ హీరోగా చేసిన మగధీర సినిమా ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది. రామ్ చరణ్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని ఒక అద్భుతమైన కంటెంట్ ను ఆడియన్స్ మీదకి విసిరాడు రాజమౌళి.

- Advertisement -

ఆ సినిమా తర్వాత రాజమౌళి పైన ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కానీ వాటి అన్నిటిని తలకిందులు చేస్తూ కమెడియన్ సునీల్ తో ఒక సినిమాను అనౌన్స్ చేసి మర్యాద రామన్నతో కూడా హిట్ ను సాధించాడు జక్కన్న. ఆ తర్వాత నాని హీరోగా చేసిన ఈగ సినిమా ఒక సంచలనం అని చెప్పొచ్చు. టెక్నికల్ గా ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు రాజమౌళి. ఈగ ని పెట్టి కూడా హిట్ కొట్టాడు అంటూ అప్పట్లో రాజమౌళి ని కొనియాడారు చాలామంది.

ఇకపోతే రాజమౌళి బాహుబలి సినిమాతో మరో స్టాండర్డ్ ను సెట్ చేశాడు. అయితే బాహుబలి సినిమా తెలుగు సినిమాను ప్రపంచ సినిమాకి పరిచయం చేసింది. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఉన్న ఆస్కార్ కూడా అందుకుంది ఆర్ ఆర్ ఆర్ సినిమా. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఒక అడ్వెంచర్ ఫిలిం అని ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మొత్తం మూడు పార్ట్ లుగా ఉండబోతుందని తెలుస్తుంది. మామూలుగా రెండు పార్ట్స్ లో చేసిన బాహుబలి ప్రపంచం మొత్తాన్ని కట్టి పడేసింది. అలాంటిది మహేష్ బాబు లాంటి హీరోతో మూడు పార్ట్స్ ప్లాన్ చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. అయితే రాజమౌళికి ఉన్న బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మహాభారతం అని చెప్పాలి. ఇక ఈ మూడు పార్ట్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని చాలామంది ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ మూడు పార్ట్స్ పూర్తి అయ్యేసరికి కనీసం ఏడు సంవత్సరాలు పడుతుందని చాలామంది అంచనా.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు