Rajamouli : కథను చూపించడమే జక్కన్న ప్రత్యేకత

ప్రస్తుతం ఇండియన సినిమాలో ఉన్న టాప్ మోస్ట్ దర్శకులు అనగానే పక్కన గుర్తొచ్చే పేరు ఎస్ఎస్ రాజమౌళి. తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చుని పెట్టిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి ఇంపాక్ట్ ను తన సినిమాతో క్రియేట్ చేశాడు రాజమౌళి. అయితే శాంతినివాసం అనే సినిమా సీరియల్ కి దర్శకుడుగా పనిచేసిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా దర్శకుడుగా మారాడు.

ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత సింహాద్రి అనే సినిమాను తెరకెక్కించి తనలో ఉన్న మాస్ కమర్షియల్ యాంగిల్ ను బయటకు తీశాడు జక్కన్న. అక్కడితో జక్కన్న తన స్థాయిని పెంచుకుంటూ వెళ్లిపోయాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సై సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆడియన్స్ పల్స్ తెలియాలి అని కొందరు అంటుంటారు. అలా ఆడియన్స్ పల్స్ తెలిసిన ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని అందరం ఒప్పుకోవాల్సిందే.

రాజమౌళి ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ వెళ్తున్న తరుణంలో, రాజమౌళి కెరియర్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ వచ్చిన చిత్రం మగధీర. మగధీర సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. రామ్ చరణ్ ని స్టార్ట్ చేసిన సినిమా అది. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు లేని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది మగధీర సినిమా. ఆ సినిమా తర్వాత రాజమౌళి మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి

- Advertisement -

కానీ పెరిగిన ఆ అంచనాలకు భిన్నంగా సునీల్ వంటి ఒక కమెడియన్ తో సినిమాను అనౌన్స్ చేశాడు రాజమౌళి. అదే మర్యాద రామన్న. ఇకపోతే మర్యాద రామన్న సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాద రామన్న సినిమా రిలీజ్ కంటే ముందుగానే ఆ స్టోరీని పూర్తిగా రివీల్ చేశాడు జక్కన్న. కథను చెప్పేసిన తర్వాత కూడా చాలామంది ఆసక్తితో ఆ సినిమాకి వెళ్లారు. దానికి కారణం జక్కన్న ఆ కథను ఎలా చూపించాడు అని చూడటం కోసం. కథను చెప్పటం వేరు. కథను చూపించడం వేరు. తెలిసిన కథనే గొప్పగా చూపించడంలో రాజమౌళి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడని మనకు తెలిసిందే.

కేవలం మర్యాద రామన్న సినిమాకు మాత్రమే కాదు రాజమౌళి చేసిన చాలా సినిమాలకి ముందుగానే కొంతమేరకు కథను రివీల్ చేస్తాడు. ఆ తరువాత థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ని తన యొక్క డైరెక్షన్ టేకింగ్ తో సర్ప్రైజ్ చేస్తాడు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మహేష్ బాబుతో అడ్వెంచర్ ఫిలిం చేస్తున్నారు అని రీవీల్ చేశాడు జక్కన్న.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఈ కథను కూడా రివీల్ చేసే అవకాశం ఉందా అని చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ జక్కన్న కథను రివీల్ చేసినా కూడా మనం ఆ కథ గురించి ఏం ఊహించుకున్న అంతకుమించి విజువల్ గా జక్కన్న చూపిస్తాడని నమ్మకం చాలా మందికి ఉంది. ఏదేమైనా ఇప్పటివరకు తెలుగుకు మాత్రమే పరిమితమైన మహేష్ బాబు క్రేజ్ ఇకపైన పాన్ ఇండియా లెవెల్ లో పరిచయం కానుంది. ఈ సినిమా దాదాపు నాలుగేళ్ల తర్వాత రిలీజ్ కానుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు