Khaleja: మహాశివరాత్రికి రీ రిలీజ్ చేస్తే థియేటర్లో జాగరాలే

కొన్ని సినిమాలు చూడగానే నచ్చవు చూడగా చూడగా నచ్చుతాయి. అలాంటి సినిమాల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మాత్రమే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజా, గుంటూరు కారం. అతడు ఖలేజా సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి టీవీలో వస్తున్న ప్రతిసారి హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటాయి ఈ సినిమాలు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫిలిం గుంటూరు కారం. ఈ సినిమా మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన అందుకొని ముందుకు కొనసాగింది. అయితే ఈ సినిమాకి కొన్నిచోట్ల డిజాస్టర్ టాక్ కూడా వచ్చింది. కానీ మహేష్ బాబుకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమాకి కూడా తర్వాత పాజిటివ్ వైబ్ వచ్చింది. త్రివిక్రమ్ టైప్ ఆఫ్ కామెడీ మహేష్ టైమింగ్ ఇవన్నీ స్లో స్లోగా ఆడియన్స్ కి అర్థం అయ్యాయి. ఆడియన్స్ కి ఇవి అర్థమయ్యేలోపే సినిమా థియేటర్లో నుంచి ఓటిటిలో కూడా వచ్చేసింది.

ఇకపోతే వీరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో దేవుడు అనే కాన్సెప్ట్ ని త్రివిక్రమ్ చూపించిన విధానం అద్భుతం అని చెప్పొచ్చు. దేవో మనుష్య రూపేణ అనే ఒక సంస్కృతం లైన్ ని సినిమాకు అప్లై చేసి అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కానీ ఈ కాన్సెప్ట్ అప్పట్లో చాలామందికి ఎక్కలేదు.

- Advertisement -

కానీ ఇప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వేరు. చాలామంది ఇప్పుడు త్రివిక్రమ్ ఖలేజా రీ రిలీజ్ చేస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అంత వర్త్ ఉన్న సినిమా ఖలేజా. ఈ సినిమాలో మహేష్ బాబు పర్ఫామెన్స్, మహేష్ బాబు టైమింగ్, మహేష్ బాబు డైలాగ్ డెలివరీ అన్నీ కూడా వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.

అలానే ఈ సినిమా పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకి మణిశర్మ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని సదాశివా సన్యాసి అనే పాట ఎంత పెద్ద పాపులర్ అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలానే కృష్ణుడు గురించిన పాట కూడా ఈ సినిమాలో బాగా ఫేమస్. ఇకపోతే ఈ మహాశివరాత్రికి ఖలేజా లాంటి సినిమాని రీ రిలీజ్ చేస్తే మహేష్ అభిమానులందరూ థియేటర్లో జాగరాలు చేస్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అంత వర్త్ ఉన్న సినిమా ఖలేజా.

ఇకపోతే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇదివరకే ఒక్కడు పోకిరి బిజినెస్ మేన్ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళ్లీ ఈ ఏడాది మహేష్ బాబు పుట్టినరోజుకి రీ రిలీజ్ చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఖలేజా, అతడు కూడా ఉన్నాయి. అయితే ఈసారి ఖలేజా సినిమా చేస్తే మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు