Vishwak Sen : “గామి” కి ఊహించని షాకిచ్చిన సెన్సార్ బోర్డ్..

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో “గామి” ఒకటి. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల్లో కూడా ‘గామి’ కే ఎక్కువ హైప్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా టీజర్ గాని, ట్రైలర్ గాని క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటింది. దాదాపు నాలుగేళ్ళ పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డానని దర్శకుడు విద్యాధర్ చెప్పడం జరిగింది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన శివం థీమ్ సాంగ్ కూడా చాలా బాగుండి సినిమాకు హైప్ తీసుకుని వచ్చింది. అయితే అన్ని సజావుగా జరుగుతున్నాయన్న క్రమంలో మేకర్స్ కి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది.

గామి కి A సర్టిఫికెట్..

ఈ శుక్రవారం భారీ అంచనాలతో రిలీజ్ “గామి” మూవీకి అనూహ్యంగా సెన్సార్ బోర్డు వాళ్ళు A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అంటే పెద్దలకు మాత్రమే సినిమా చూసే అనుమతి అన్నమాట. ఇక ఈ ట్యాగ్ రావడంతో 18 ఏళ్ళు నిండిన వారికి మాత్రమే ప్రదర్శించాలని అర్ధం. అయితే ఈ సినిమా ఏమి ఆడల్ట్ కంటెంట్ సినిమా కూడా కాదు. అలాంటిది ఏ సర్టిఫికెట్ ఎందుకిచ్చారు అంటారా? పైగా ట్రైలర్ చూస్తుంటే పెద్దగా నెగిటివ్ కూడా ఏమి లేదు. సెన్సిటివ్ విషయాలు గాని, వివాదాస్పద అంశాలు గాని ఏమి లేవు. మరి ఏ సర్టిఫికెట్ ఎందుకు అంటే? కారణం ఉంది.

- Advertisement -

గత కొన్ని నెలలుగా మల్టీప్లెక్సుల యాజమాన్యాలు ఈ నిబంధనను కఠినంగా పాటిస్తున్నారు. ఎలాంటి ఆడల్ట్ మూవీ అయినా, ఏ సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్నా, ఆ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు సెన్సార్ వాళ్ళు. ఇది ఒక రకంగా కొన్ని సినిమాలకి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అప్పట్లో సలార్ సినిమా కు ఇదే సమస్య వచ్చినప్పుడు కొందరు టీనేజ్ ఆడియన్స్ ని పలు థియేటర్లలో అలౌ చేయలేదు. అప్పుడు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ మూవీ కాబట్టి కుటుంబ సమేతంగా చూడొచ్చనే అభిప్రాయం వల్ల కలిగిన ఇబ్బంది అది. ఇక అలాంటి ఇబ్బందే ఈ గామి సినిమాకు వచ్చింది. విశ్వక్ సేన్ కమర్షియల్ హీరో అయినా, గామి సినిమా కథ నేపథ్యం వేరే కావడం వల్ల, అందరూ చూడాల్సిన సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదని నెటిజన్ల అభిప్రాయం.

అందుకే A ..
అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గామి మూవీకి A సర్టిఫికెట్ వచ్చిందంటే, కంటెంట్ లో యాక్షన్, వైలెన్స్ తో పాటు రా ఎపిసోడ్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే అఘోరాగా నటించిన విశ్వక్ సేన్ ఈ స్పిరిచువల్ థ్రిల్లర్ లో సహజత్వం కోసం చూపించిన కొన్ని సన్నివేశాలు పిల్లలను భయపెట్టేలా ఉండొచ్చని సెన్సార్ టీమ్ అభిప్రాయ పడిందట. ఇక హిమాలయాల్లో జరిగే కొన్ని ఎపిసోడ్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయని సమాచారం. అయితే సినిమాకి ఉన్న హైప్ ని బట్టి చూస్తే మహాశివరాత్రి కి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంచి టాక్ వస్తే ప్రేక్షకులు ఇవేవి పట్టించుకోకుండా ఫ్యామిలీ తో సినిమాకి వెళ్తారని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగేళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న గామికి యువి క్రియేషన్స్ అండ వల్ల రిలీజ్ పరంగా మంచి థియేటర్లు దక్కుతున్నాయి.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు