Sri Vishnu: సైలెంట్ గా పూర్తిచేసాడు

2009లో రిలీజ్ అయిన బాణం సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ విష్ణు. ఆ తర్వాత సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, వంటి సినిమాల్లో కూడా కనిపించాడు శ్రీ విష్ణు. అయితే పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ,ఇష్క్, కాదల్ సినిమాలో లీడ్ రోల్ లో కనిపించి మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ సినిమాలో కూడా మంచి పేరును సాధించుకున్నాడు. ఆ తర్వాత చేసిన సన్నాఫ్ సత్యమూర్తి, అసుర వంటి సినిమాల్లో మంచి గుర్తింపు లభించింది. రామ్ తో చేసిన “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా శ్రీ విష్ణు కి ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత శ్రీ విష్ణు సోలో హీరోగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు.

వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో శ్రీ విష్ణు పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం వివేక ఆత్రేయ ఆ కథను రాసుకున్న విధానం అని చెప్పొచ్చు. మెంటల్ మదిలో సినిమా తర్వాత వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన నీది నాది ఒకే కథ అనే సినిమాలో హీరోగా కనిపించాడు శ్రీ విష్ణు. ఈ సినిమా శ్రీ విష్ణు ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత చేసిన వీరభోగ వసంత రాయలు సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

మళ్లీ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా మంచి గుర్తింపును శ్రీ విష్ణుకు తీసుకొచ్చి పెట్టింది. అయితే శ్రీ విష్ణు కెరియర్లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ రాజరాజ చోర, సామజవరగమన అని చెప్పొచ్చు. వరుస డిజాస్టర్ తర్వాత సామజవరగమన సినిమా శ్రీ విష్ణు కి మంచి గుర్తింపును తీసుకొని వచ్చింది. ఇది ఫ్యామిలీస్ అందరికి కూడా అద్భుతంగా నచ్చింది. దీనిని ఒక మినీ నువ్వు నాకు నచ్చావ్ అంటూ కూడా చాలామంది ప్రశంసించారు. ఇకపోతే శ్రీ విష్ణు ప్రస్తుతం చేస్తున్న సినిమా “ఓం భీమ్ బుష్” ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

- Advertisement -

ఇకపోతే శ్రీ విష్ణు రైటర్ హుస్సేన్ కిరణ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హైదరాబాద్ లో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 70 నుంచి 80% వరకు పూర్తయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మార్చ్ 7వ తారీఖున ఎండ్ అవుతుంది. ఇకపోతే ఏప్రిల్ లో 8 నుంచి మరో షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా మొత్తం మే నెలకి పూర్తబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

ఒక సినిమాను మొదలు పెట్టినప్పటి నుంచి పోస్టర్, టీజర్, గ్లింప్స్ అంటూ కొంచెం హడావిడి చేస్తాయి కొన్ని ప్రొడక్షన్ హౌసెస్. కానీ దాదాపు 80% సినిమాని ఎటువంటి హడావిడి లేకుండా శ్రీ విష్ణు పూర్తి చేశాడు అంటే ఇది కొంచెం హర్షించదగ్గ విషయమే. ఇకపోతే నెక్స్ట్ గీత ఆర్ట్స్ లో శ్రీ విష్ణు సినిమాను చేయనున్నట్లు రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు.

అలానే హాసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాను చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో కూడా అందరిని బాగా ఆకట్టుకుంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు