Gopi Mohan: ఇండస్ట్రీ లో 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న రచయిత

గోపి మోహన్ సాధారణ ప్రేక్షకులకు ఈ పేరు తెలియకపోయినా కూడా చాలామంది సినీ ప్రముఖులకు ఈ పేరు సుపరిచితమని చెప్పొచ్చు. ఎందుకంటే అంతటి అద్భుతమైన కథలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు గోపి మోహన్. కేవలం కథలను అందించడం మాత్రమే కాకుండా కొన్ని సూపర్ హిట్ సినిమాలుకు స్క్రీన్ ప్లే విషయంలో కూడా వర్క్ చేశారు గోపి మోహన్.

ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్స్ కున్న వాల్యూ గురించి తెలిసిందే. ఒకప్పుడు రచయితకు అంత పెద్దగా పేరు వచ్చేది కాదు. కానీ రీసెంట్ టైమ్స్ లో రచయితలను కూడా గుర్తిస్తున్నారు సినిమా ప్రేమికులు, ప్రేక్షకులు. అయితే దర్శకుడు స్థాయిలో వాళ్ళకి గుర్తింపు రాకపోయినా కూడా చాలామంది దర్శకులు ఈ స్థాయిలో ఉండడానికి వెనుక ఎంతోమంది గొప్ప రచయితలు ఉంటారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఇప్పుడు ఫామ్ లో లేకపోయినా కూడా ఒకప్పుడు శ్రీనువైట్ల పేరు వినిపించేది. శ్రీనువైట్ల రాసిన చేసిన ప్రతి సినిమాకి వెనుక గోపి మోహన్, కోన వెంకట్ వంటి రచయితలు ఉండేవాళ్ళు. ఇటువంటి రచయితలు ఉండటం వల్లే శ్రీనువైట్ల కెరియర్ లో మంచి హిట్ సినిమాలు పడ్డాయి అని కూడా చెప్పొచ్చు.

- Advertisement -

కెరీర్‌ ఇక్కడి నుంచే స్టార్ట్…
అయితే రచయిత గోపి మోహన్ నేటికీ సక్సెస్ఫుల్ గా పాతిక సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్నారు. 1999లో రిలీజ్ అయిన యమజాతకుడు అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు గోపి మోహన్. ఆ తర్వాత వంశీ, నువ్వు నేను వంటి సినిమాలకు కూడా పనిచేశారు. అయితే ఆయన 2002 నుంచి స్క్రీన్ ప్లే రైటర్ గా తన పనిని మొదలు పెట్టాడు. సంతోషం, వెంకీ, దుబాయ్ శీను, దేనికైనా రెడీ, అల్లుడు శీను డిక్టేటర్, ఓ బేబీ వంటి ఎన్నో సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశాడు.

ఫ్లాప్స్… అంతకు మించిన హిట్స్…
అలానే కథా రచయితగా కూడా కొన్ని సినిమాలకు పని చేశాడు గోపి మోహన్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన రెడీ, కింగ్, నమో వెంకటేశ, దూకుడు వంటి సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటికీ కథలను అందించింది గోపి మోహన్. గోపి మోహన్ చివరగా పనిచేసిన సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ ను పొందుకోలేదు.

మోస్ట్ వాంటెడ్ కాంబో…
మళ్లీ శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎందుకంటే వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చాయని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా మీమ్స్ కనిపించే టెంప్లేట్లు అన్ని వీళ్ళ సినిమాలో నుంచి తీసుకున్నవే. అయితే వీరి ముగ్గురు కలయిక మళ్లీ జరుగుతుందో లేదో తెలియదు. కానీ వీరి ముగ్గురు కలిసి మళ్ళీ సీరియస్ గా ఒక సినిమాను చేస్తే ఆడియన్స్ ఆ సినిమాను హిట్ చేసి బ్రహ్మరథం పట్టడానికి రెడీగా ఉన్నారు.

రచయితగా గోపీచంద్ మళ్లీ గోపి మోహన్ మళ్ళీ కం బ్యాక్ ఇచ్చి అద్బుతమైన సినిమాలకు పనిచేసి, తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఫిల్మీ ఫై తరఫున శుభాకాంక్షలు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు