Allu Arjun: బన్నీ బర్త్ డేకి అదిరిపోయే సర్ప్రైజ్… వర్కౌట్ అయ్యే పనేనా?

“గంగోత్రి” సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “ఆర్య” సినిమాతో మంచి పేరును సాధించుకున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమాలో సుకుమార్ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, అలానే అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్ లో జీవించిన విధానం… ఈ రెండు కూడా సినిమాని సూపర్ హిట్ అనిపించేలా చేశాయి. ఫలితంగా మూవీ అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంది.

అల్లు అర్జున్ తో సుకుమార్ బాండింగ్…
ఇప్పటికీ అల్లు అర్జున్ కెరియర్లో బెస్ట్ ఫిలిమ్ అంటే “ఆర్య” అని చెప్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఎంత మంది దర్శకులతో పని చేసినా కూడా సుకుమార్ తో అల్లు అర్జున్ కున్న బాండింగ్ వేరు. చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అలానే సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” సినిమా అల్లు అర్జున్ కి ఎంత పెద్ద పేరుని తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ చాలామంది సెలబ్రిటీస్, క్రికెటర్స్, పొలిటిషన్స్ వీరందరూ చెబుతూ ఆ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇకపోతే ఇప్పటివరకు ఎవరికీ దక్కని అవార్డు కూడా అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ని కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అంతటి ఘన విజయాన్ని అల్లు అర్జున్ ఖాతాలో వేశాడు సుకుమార్. అయితే ఇదంతా పుష్ప సినిమా తర్వాత.

Arya 2" re-release for Allu Arjun's birthday

- Advertisement -

“ఆర్య 2” రీ రిలీజ్ ప్లాన్…
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా “ఆర్య 2”. వాస్తవానికి ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా హిట్ కాలేదు. దీనికి కారణం ఆర్య సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మొదలైన ఈ రిలీజ్ ట్రెండ్ అనేది పవన్ కళ్యాణ్ బర్త్ డే తో పీక్ చేరిందని చెప్పొచ్చు. ఒక్కడు, పోకిరి, తమ్ముడు, జల్సా వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ కూడా సాధించాయి. అయితే ఈ సినిమాలు తరువాత ఆరంజ్, 7 జి బృందావన్ కాలనీ, సూర్య సన్నాఫ్ కృష్ణన్ ఈ సినిమాలకు మాత్రమే మళ్లీ ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలు అప్పట్లో కమర్షియల్ గా హిట్ కాకపోయినా కూడా ఇప్పుడు రీ రిలీజ్ లు మాత్రం మంచి కలెక్షన్స్ సాధించాయి.

Arya 2" re-release for Allu Arjun's birthday

అలానే ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, ప్రభాస్ నటించిన ఛత్రపతి, అల్లు అర్జున్ నటించిన దేశముదురు వంటి సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలకి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదన్నది వాస్తవం. సిద్ధార్థ నటించిన “ఓయ్” మూవీకి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఇప్పుడు మరోసారి “ఆర్య 2” సినిమాను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా “ఆర్య 2” సినిమాను రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ కెరియర్ లో ఆర్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమా రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఉంటుంది. కానీ ఆర్య 2 సినిమాకి అంత రెస్పాన్స్ ఉంటుందా? లేదా అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న డౌట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు