Meenakshi Chaudhary: ఈ బ్యూటీని ఇప్పట్లో వదిలేలా లేరు… ఇదేం లైనప్ రా బాబూ

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ప్లేస్ ను మీనాక్షి చౌదరి రీప్లేస్ చేసినట్టుగా కనిపిస్తోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో “గుంటూరు కారం” సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ లో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. మహేష్ బాబు, విజయ్ వంటి సూపర్ స్టార్లతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేయడమే కాకుండా ఈ అమ్మడు ఏకంగా అరడజను సినిమా చాన్సులను కొట్టేసి, ఆరుగురు హీరోలను లైన్లో పెట్టేసింది. మరి ఇంతకీ మీనాక్షిపై మనసు పడ్డ ఆ హీరోలు ఎవరెవరు? ప్రస్తుతం ఆమె లైనప్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

“విశ్వంభర”లో గెస్ట్ రోల్
మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ “విశ్వంభర”. “బింబిసారా” ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్ మూవీకి విక్రమ్, వంశీ, ప్రమోద్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. “విశ్వంభర”లో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, మరికొంతమంది క్రేజీ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించబోతున్నారు. అందులో భాగంగానే మీనాక్షి చౌదరి గెస్ట్ రోల్ లో మెరవబోతోంది. దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే ఈ బ్యూటీ “విశ్వంభర”లో భాగమైందనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

“గోట్”లో విజయ్ తో రొమాన్స్
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైలర్ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నటిస్తున్న మూవీ కావడంతో “గోట్” మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.

- Advertisement -

“లక్కీ భాస్కర్”లో లక్కీ ఛాన్స్
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. “సీతారామం” సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు తెలుగులో “లక్కీ భాస్కర్” అనే సినిమాను చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

“మట్కా”లో మరో మెగా ఛాన్స్
ఇప్పటికే మెగాస్టార్ చిరుతో “విశ్వంభర” మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది మీనాక్షి చౌదరి. ఇప్పుడు “మట్కా” మూవీలో హీరోయిన్ ఛాన్స్ పట్టేసి మరో మెగా హీరో సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

వెంకటేష్ కు జోడిగా…
టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి షూటింగ్ ఏప్రిల్ లేదా మేలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మూవీలో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

దళపతి 69
కోలీవుడ్ స్టార్ విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతానని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా 68 సినిమాలు చేసిన ఈ హీరో 69వ సినిమాతో సినీ కెరీర్ కు ఎండ్ కార్డ్ వెయ్యబోతున్నాడు. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయ్ తో “గోట్” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న మీనాక్షి చౌదరి ఈ మూవీలో కూడా ఆయనతో రొమాన్స్ చేయబోతుందని సమాచారం. మొత్తానికి టాప్ హీరోలు అందరికీ బెస్ట్ ఆప్షన్ గా మారింది ఈ హాట్ బ్యూటీ.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు