జబర్దస్త్ గురించి తెలుగు బుల్లితెర ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ కామెడీ షోను చూడకుండా కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు నిద్ర కూడా పోరు. అలాగే ఎంతోమంది కమెడియన్స్ ఈ షో ద్వారా స్టార్డం తెచ్చుకుని, ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సుడిగాలి సుధీర్ కు ఈ రేంజ్ లో పాపులారిటీ రావడానికి జబర్దస్త్ షోనే కారణం. అలాగే గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఆటో రాంప్రసాద్ వంటి కమెడియన్స్ జబర్దస్త్ వల్లనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు హాట్ యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లు కూడా ఈ షో వల్లనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కు సిరి హన్మంతు యాంకర్ గా వ్యవహరిస్తుండగా, తాజాగా నూకరాజు వేసిన ఒక పంచ్ తో ఆమె త్వరలోనే ఈ షోకు గుడ్ బై చెప్పబోతోంది అని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్టుగా అయ్యింది.
యాంకర్ల రీప్లేస్మెంట్ కంటిన్యూస్…
అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె స్థానంలో సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చింది. కానీ కొన్ని నెలల తర్వాత ఆమె కూడా జబర్దస్త్ కు బైబై చెప్పేసింది. అనంతరం యాంకర్ గా సిరి వచ్చింది. బిగ్ బాస్ షోతో సిరి హనుమంతుకు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ పెరిగిన విషయం తెలిసిందే. జబర్దస్త్ యాంకర్ గా సిరి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. అయితే అంతలోనే సిరి కూడా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పబోతోంది అనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా జబర్దస్త్ నుంచి రిలీజ్ అయిన ప్రోమో ఆ వార్తలకు బలం చేకూర్చింది.
నూకరాజు హింట్…
తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. అయితే స్కిట్ లో భాగంగా కమెడియన్ నూకరాజు సిరి హనుమంత్ పై చేసిన కామెడీ ఆమె షోకు గుడ్ బై చెప్పబోతుందా అనే అనుమానాలకు తెరతీసింది. నూకరాజు స్కిట్ లో భాగంగా ఆమె దగ్గరకు వెళ్లి “సిరి హనుమంత్ జస్ట్ ఫర్ వన్ మంత్” అని అడగ్గా… సిరి నవ్వుతూ “వాడికి ఫ్యూచర్ ఉండాలని వేశాడు” అని పంచ్ వేసింది. దీంతో నూకరాజు “అంటే మీరు కంటిన్యూ అవుతారా ?” అని అడిగాడు. “అంతే కదా” అని సిరి ఆన్సర్ ఇవ్వగా, “సరే మీరే చూడండి అర్థమవుతుంది” అంటూ సెటైరికల్ గా నవ్వడం ఆ ప్రోమోలో కనిపిస్తోంది. దీంతో ఇది చూసాక జబర్దస్త్ నుంచి సిరి వెళ్ళిపోతుంది అనే ప్రచారం మొదలైంది. అందుకే నూకరాజు ఇలా స్కిట్ లో పంచ్ వేసి ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి…
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి హనుమంతు తన గ్లామర్ షో తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ముందుగా ఆమె యూట్యూబర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. అలా క్రేజ్ సంపాదించుకొని ముందుగా బిగ్ బాస్ హౌస్ లోకి, ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ బిగ్ బాస్ లో హౌజ్ లో ఉన్నప్పుడు షణ్మఖ్ తో సన్నిహితంగా మెలిగి ట్రోలింగ్ బారిన పడింది.
check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.