Tollywood: మెగా హీరోలకు బడ్జెట్ కష్టాలు

నాన్ థియేట్రికల్ మార్కెట్ పడిపోవడంతో ప్రస్తుతం చాలా సినిమాలు బడ్జెట్ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కొన్ని సినిమాలైతే అనౌన్స్మెంట్ వరకూ వచ్చి ఆ తర్వాత ఆగిపోతున్నాయి. ముఖ్యంగా మెగా హీరోల విషయంలో ఈ సమస్య మరీ దారుణంగా ఉంది. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరం తేజ్ లను బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులు పెడుతున్నాయి.

“గాంజా శంకర్”
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “గాంజా శంకర్”. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రూపొందిస్తున్నారు. సాయి ధరం తేజ్ కు ఇది 17వ సినిమా కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. అయితే తేజ్ భారీగా పారితోషకం డిమాండ్ చేయడం వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని రూమర్లు వైరల్ అయ్యాయి. అయితే తేజ్ మార్కెట్ ఇప్పుడు ఆయన పారితోషికం డిమాండ్ చేసే రేంజ్ లో లేకపోవడం, ఇటీవల కాలంలో తెలుగు సినిమాల నాన్ ధియేట్రికల్ మార్కెట్ కూడా పడిపోవడంతో, వాటిని దృష్టిలో పెట్టుకుని సితార ఎంటర్టైన్మెంట్స్ “గాంజా శంకర్” ప్రాజెక్టును ఆపేసిందని ప్రచారం జరిగింది. అయితే ఇటీవలే “గాంజా శంకర్” టైటిల్ ను మార్చాలంటూ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు చిత్ర బృందానికి నోటీసులు జారీ చేయడంతో ఈ మూవీ ఆగిపోలేదని అంతా ఫిక్స్ అయ్యారు. అలాగే “గాంజా శంకర్”లో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ నిధి అగర్వాల్ ఆమెను రీప్లేస్ చేసింది అనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడానికి ప్రధాన కారణం బడ్జెట్ సమస్యలు అని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు హోల్డ్ లో ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

వరుణ్ తేజ్ మార్కెట్ డౌన్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్లను అందుకున్న విషయం తెలిసిందే. గని, గాంధీవదారి అర్జున సినిమాలతో దారుణమైన ప్లాప్స్ మూట కట్టుకున్న వరుణ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. ఒక్కో సినిమాతో వరుణ్ సినిమాల థియేట్రికల్ మార్కెట్ పడిపోతూ వస్తోంది. తాజా డిజాస్టర్ కారణంగా ఆయన నెక్స్ట్ మూవీ “మట్కా” నాన్ థియేట్రికల్ డీల్స్ పై గట్టి ఎఫెక్ట్ పడింది. డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “మట్కా” మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. డిసెంబర్ మధ్యలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. భారీ బడ్జెట్ తో యదార్థ సంఘటనల ఆధారంగా 1960 నేపథ్యంలో 1958 నుంచి 1982 వరకు 24 సంవత్సరాల పాటు సాగే కథతో మట్కా రూపొందుతోంది. కానీ తాజాగా “ఆపరేషన్ వాలెంటైన్” రిజల్ట్ చూశాక ఈ మూవీ బడ్జెట్ విషయంలో నిర్మాతలు డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది.

- Advertisement -

వైష్ణవ్ తేజ్ కూ ఇదే సమస్య…
మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ కూడా సేమ్ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఉప్పెన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో ఆదికేశవ రూపంలో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకంటే ముందు వచ్చిన కొండ పొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. దీంతో ఆయనకు ఆఫర్లు కరువయ్యాయి. మొత్తానికి మెగా యంగ్ హీరోలు అందరూ తమ నెక్స్ట్ సినిమాల విషయంలో ఇలా బడ్జెట్ కష్టాలను ఎదుర్కొంటున్నారు అన్నమాట.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు