Sailesh: నాని హోల్డ్ లో పెట్టింది చైతన్య ఓకే చేశాడా.?

అక్కినేని నాగచైతన్య, వాసు వర్మ దర్శకత్వం వహించిన జోష్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ కాలేదు. కానీ ఈ సినిమాకి ఇప్పటికీ ఒక మంచి స్టేటస్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో వాసు వర్మ రైటింగ్ అంత డిఫరెంట్ గా ఉంటుంది. ఆటిట్యూడ్ అంటే ఎలా ఉంటుందో అని చూపించిన సినిమా జోష్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాగచైతన్య పర్ఫామెన్స్ చేసిన తీరు కూడా అదే స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా ఆ రోజుల్లో సరిగ్గా ఆడలేదు.

ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేసిన సినిమా ఏ మాయ చేశావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయింది. ఒక క్లాస్ లవ్ స్టోరీని నాగచైతన్య తో చెప్పడం అనేది అద్భుతంగా అనిపించింది. చైతన్య కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించి మంచి మార్కులను సాధించాడు. అక్కడితోనే ఈ సినిమాలో నటించని సమంతతో కూడా ప్రేమ వ్యవహారం మొదలై అది పెళ్లి వరకు దారితీసి కొన్ని అనివార్య కారణాల వలన విడిపోవడం కూడా జరిగిన విషయం మనకి తెలిసిందే.

ఇకపోతే రీసెంట్ గా నాగచైతన్య మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ కెరియర్లో ముందుకు వెళ్తున్నాడు. చివరగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా నాగచైతన్యకు మంచి హిట్టును తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రేవంత్ పాత్రలో నాగచైతన్య నటించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల అంత అద్భుతంగా ఆ సినిమాను తెరకెక్కించారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాను చేస్తున్నాడు నాగచైతన్య. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఈ సినిమాలో నాగచైతన్య సముద్రంలో పనిచేసే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో కూడా అంచనాలను ఒక రేంజ్ లో పెంచింది. ఇక ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్లో ఒక జైల్ సెట్ లో జరుగుతుంది.

కార్తికేయ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాతో పాటు తన తదుపరి సినిమాలను కూడా లైన్లో పెట్టే పనిలో ఉన్నాడు నాగ చైతన్య. హిట్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శైలేష్ కొలను దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు నాగచైతన్య.

రీసెంట్ గా శైలేష్ కొలను నాగచైతన్యకి ఒక స్టోరీని వినిపించాడట. అయితే ఆ స్టోరీ లైన్ నచ్చిన నాగచైతన్య దానిని డెవలప్ చేయమని శైలేష్ కి చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. ఇకపోతే శైలేష్ నానితో హిట్ 3 సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా ప్రకటించాడు. కానీ ప్రస్తుతం నాని లైన్ అప్ లో ఈ సినిమా గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇకపోతే నాని ఓల్డ్ లో పెట్టిన సబ్జెక్టును చైతన్య చేస్తున్నాడా.? లేదంటే చైతన్యకి శైలేష్ కొత్త సబ్జెక్టు చెప్పాడా అనే దాని విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు