Adivi Sesh – Dulque : మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ లోడింగ్?

టాలీవుడ్ ఫిలిం మేకర్స్, స్టార్స్ ప్రస్తుతం సీక్వెల్స్, మల్టీసారర్లతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. పొరుగు భాషల నటీనటులు కూడా తెలుగు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోలతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్ లోడింగ్ అవుతోంది అనే వార్త బయటకు వచ్చింది. ఒకే ఫ్రేమ్ లో బాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ కనిపించబోతున్నారని సమాచారం.

అడివి శేష్, దుల్కర్ మల్టీస్టారర్…
అడివి శేష్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా ఒక క్రేజీ మల్టీస్టారర్ లోడింగ్ అవుతోంది అనేది ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్ దగ్గర పని చేసిన ఒక కుర్రాడు డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ మల్టీస్టారర్ ను ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అడివి శేష్, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ ప్రయోగాత్మక సినిమాల్లో నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాగే యాక్టింగ్ పరంగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసే పాత్రలు, స్పెషల్ స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ కొత్త డైరెక్టర్ కు ఈ యంగ్ హీరోలు ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సౌత్ ఇండస్ట్రీలో ఇదొక ఇంట్రెస్టింగ్ కాంబో అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్ళనుందని ప్రచారం జరుగుతుంది.

అడివి శేష్ లైనప్…
అడవి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అడవి శేష్ ఖాతాలో “G2”, డెకాయిట్ అనే రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో “గూడచారి” సీక్వెల్ “గూడాచారి 2” తెరకెక్కబోతోంది. ఈ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జగపతిబాబు, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇక “డెకాయిట్” విషయానికి వస్తే… షానిల్ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ఇది. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడవి శేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. విడిపోయిన ఇద్దరు ప్రేమికులు వాళ్ళ జీవితాన్ని మార్చే ఒక దోపిడీ కోసం ఏకం కావాల్సి వస్తే ఎలా ఉంటుంది అన్నదే “డెకాయిట్” స్టోరీ. కొన్ని రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -

దుల్కర్ సల్మాన్ సినిమాలు…
దుల్కర్ సల్మాన్ కు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ హీరో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో లక్కీ భాస్కర్ వంటి సినిమాతో బిజీగా ఉన్న దుల్కర్… తేజ సజ్జ, కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న మూవీలో ఒక ఆసక్తికరమైన పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు ఎన్బికె 109 మూవీలో కూడా బాలయ్యతో కలిసి దుల్కర్ సల్మాన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు