Gaami, Bheema: రెండింటిలోనూ శివుని రిఫరెన్స్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి సీజన్లో ప్రతి పండక్కి ప్రత్యేకంగా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలను ప్లాన్ చేస్తారు. ఇంకొన్ని సినిమాలు మామూలుగానే రిలీజ్ చేస్తారు. అయితే పర్టిక్యులర్ గా ఆ పండగకు సంబంధించిన సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ వేరే రకంగా ఉంటుందని చెప్పొచ్చు. మార్చి 8న శివరాత్రి సందర్భంగా అలాంటి రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ కానున్నాయి.

విద్యాధర దర్శకత్వం వహిస్తున్న సినిమా గామి. ఈ సినిమా దాదాపుగా గత ఆరేళ్ల నుండి వర్కింగ్ లో ఉంది. ప్రతి దర్శకుడికి ఒక విజన్ ఉంటుందనే మాట వాస్తవమే. అయితే సినిమా కోసం చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడుతుంటారు అని వింటూ ఉంటాం. కానీ ఈ సినిమాకి ఖర్చుపెట్టిన కాలం మాత్రం ఇంకా చాలా విలువైనది అని చెప్పొచ్చు. ఒక అప్కమింగ్ దర్శకుడు ఒక సినిమా కోసం ఆరేళ్లు కష్టపడటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమాలో విశ్వక్సేన్ అఘోర పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమాలో విశ్వక్ పాత్ర పేరు శంకర్. అయితే ఈ సినిమా కోసం విశ్వక్సేన్ కనీసం రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని వార్తలు వినిపించాయి. అయితే ఒక నటుడు తను చేసిన సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని అంటే ఆ సినిమా ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటుందో అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలానే ఒక సినిమా కోసం అన్ని సంవత్సరాలు డేట్లు ఇవ్వడం అనేది కూడా మామూలు విషయం కాదు. ఒక కథ ఎంతగానో కదిలిస్తే తప్ప అంత సాహసం అనేది చేయరు.

- Advertisement -

ప్రభాస్ లాంటి స్టార్ హీరో బాహుబలి కోసం ఐదు సంవత్సరాలు సమయాన్ని వెచ్చించాడు. అంటే దానికి తగ్గ ఫలితం నేడు దక్కింది. ప్రభాస్ విషయానికొస్తే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెబుతారు. ఎందుకంటే బాహుబలి సినిమా అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. ఆ రేంజ్ గుర్తింపు విశ్వక్సేన్ కి వస్తుందా లేదా అనేది సినిమా ఫలితం డిసైడ్ చేస్తుంది.

ఇకపోతే ఆరేళ్ల నుంచి కష్టపడుతున్న ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. యాదృచ్ఛికంగా ఈ సినిమాలో శివునికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఉంది అనేది మనకి తెలిసిన విషయమే. ఈ సినిమాతో పాటు గోపీచంద్ నటిస్తున్న భీమా సినిమా కూడా మార్చి ఎనిమిదో తారీఖున రిలీజ్ కానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచుకుంది.

ఇకపోతే గోపీచంద్ కి ఒక హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లయింది. ఈ సినిమా మళ్లీ గోపీచంద్ కి కం బ్యాక్ అవుతుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ సినిమాలో కూడా శివుని రెఫరెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ రెండు సినిమాలు ఒకే డేట్ కి రిలీజ్ అవ్వడం అనేది యాదృచ్ఛికమని చెప్పొచ్చు. అంతేకాకుండా మహాశివరాత్రి కానుక రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో శివుని రిఫరెన్స్ ఉండడం కూడా ఒక కో-ఇన్సిడెన్స్ అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలియాలి అంటే మార్చ్ 8 వరకు వేచి చూడక తప్పదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు