Game Changer: లీక్ అయిన పాటనే అఫీషియల్ గా వదులుతున్నారు

చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకుని తనదైన పర్ఫామెన్స్ ఇచ్చి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. అయితే చిరుత సినిమా తర్వాత రామ్ చరణ్ చేసిన సినిమా మగధీర. ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డును సాధించింది. ఈ సినిమా తర్వాత అమాంతం రామ్ చరణ్ క్రేజ్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు.

ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు పాటలు అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. హరీష్ జయరాజ్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమని చెప్పొచ్చు. ఈ పాటలే ఈ సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచాయి. తీరా థియేటర్ కి వెళ్లేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త నిరాశనే మిగిల్చాయి. ఇకపోతే ఇదే సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు ఆడియన్స్ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

ఆరెంజ్ సినిమాని రీ రిలీజ్ లో ఎంజాయ్ చేయడమే కాకుండా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా తీయమని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ని అడిగిన ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే బొమ్మరిల్లు భాస్కర్ కి ఈ సినిమా రిజల్ట్ ఎంత తేడా చూపించిందో కానీ, వద్దు బాబు నమస్కారం అంటూ సీక్వెల్ విషయంలో చెప్పుకొచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్.

- Advertisement -

అయితే చరణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా చరణ్ లోని ఒక పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా అంటే రంగస్థలం అని చెప్పొచ్చు. ఆ సినిమాలో రామ్ చరణ్ పర్ఫామెన్స్ చూసి చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. రామ్ చరణ్ లో ఇంతటి గొప్ప నటుడు ఉన్నాడా అని నిరూపించిన సినిమా రంగస్థలం. తర్వాత చేసిన వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ మంచి హిట్ అయింది.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఆశలన్నీ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా పైనే ఉన్నాయి. ప్రేక్షకులకు కూడా గేమ్ చేంజర్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం కార్తీక్ సుబ్బరాజు కథ అందించడం. దాంతో పాటు శంకర్ దర్శకత్వంలో వస్తుండడంపై ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి గేమ్ చేంజర్ అనే టైటిల్ తప్ప ఇప్పటివరకు సరైన అప్డేట్ ఒకటి కూడా రాలేదు. అయితే ఆ మధ్య ఈ సినిమా నుంచి ఒక సాంగ్ లీక్ అయింది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా అదే సాంగ్ ను అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ సాంగ్ రిలీజ్ చేస్తున్నందుకు కొంతమందికి ఆనందంగా ఉంటే, ఇంకొంతమందికి లీకైన సాంగ్ ని అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారు అంటూ నిరాశపడుతున్నారు. ఏదేమైనా సినిమా హిట్ అయి మంచి కలెక్షన్స్ సాధించి చరణ్ అభిమానుల్ని సంతృప్తిపరిస్తే అంతకుమించి ఆనందం ఇంకోటి లేదు అని చెప్పొచ్చు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు