Shatamanam Bhavati : సీక్వెల్ లో ఆ యంగ్ హీరో

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిల్ రాజు ప్లానింగ్, పద్ధతి, విజన్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ కి వచ్చే కలెక్షన్స్ కంటే కూడా సంక్రాంతి రోజుల్లో ఒక సినిమాకు వచ్చే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో దిల్ రాజుకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకోసమే ప్రతి సంక్రాంతికి దిల్ రాజు ప్రొడక్షన్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమాను రిలీజ్ చేయడానికి ముందుగా ప్లానింగ్ తో ఉంటాడు దిల్ రాజు. అయితే కొన్ని స్టార్ హీరోలు సినిమాలు పోటీలో ఉన్నా కూడా తమ సినిమాను వెనక్కి తగ్గించడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు.

చాలా సంక్రాంతి సీజన్లను దిల్ రాజు సినిమాలతో నింపాడు. చాలాసార్లు స్టార్ హీరోలకు పోటీగా కూడా సినిమాలను దించాడు. అయితే అనూహ్యంగా ఆ సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఒక సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన కం బ్యాక్ సినిమా ఖైదీ నెంబర్ 150. నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటుగా శర్వానంద్ నటించిన శతమానంభవతి అనే సినిమాను రిలీజ్ చేశాడు దిల్ రాజు.

ఆ రెండు సినిమాలు తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ టాక్ అందుకుని అని ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లు నిండిపోయేలా మంచి టాక్ ను సాధించింది. కమర్షియల్ గా కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన గొప్ప సినిమాల్లో ఇదొక గొప్ప సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో శర్వానంద్ నటించిన తీరు, ప్రకాష్ రాజ్ నటించిన తీరు, ఆ కథ ఆ డైలాగ్స్ అన్నీ కూడా చాలామందికి డీప్ గా కనెక్ట్ అయ్యాయని చెప్పొచ్చు.

- Advertisement -

మాక్సిమం సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ సినిమాలను ప్రజెంట్ చేయడంలో దిల్ రాజ్ ముందుంటారు. లాస్ట్ టైం కూడా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు పోటీగా వారసుడు సినిమాను రిలీజ్ చేశాడు దిల్ రాజు. అయితే ఆ సినిమా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.ఇకపోతే శతమానం భవతి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా ప్రకటించింది చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ అందుతుంది. శతమానం భవతి సీక్వెల్ లో హీరో శర్వాకి బదులుగా ఆశిష్ రెడ్డి నటించబోతున్నట్లు తెలుస్తోంది. రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోయినా కూడా తర్వాత ఇంకొన్ని సినిమాలను లైన్లో పెట్టాడు ఆశిష్. అయితే ఈ సినిమాలన్నిటి తర్వాత శతమానం భవతి సినిమాలో కూడా ఆశిష్ పాల్గొనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే శతమానం భవతి సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది శర్వానంద్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ లో శర్వానంద్ కావాలనే చేయలేదా.? లేకపోతే శర్వానంద్ ని తప్పించారా.? అని కొత్త వార్తలు మొదలవుతున్నాయి. ఏదైనా కానీ సీక్వెల్ లో శర్వా లెవెల్ పర్ఫామెన్స్ సినిమాలో చూపించి, నాచురల్ గా అనిపిస్తే ఆ సినిమాకి కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో సందేహం లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు