Kiara Advani : పారితోషికం భారీగా పెంచేసిన కీయారా… డిమాండ్ అలాంటిది మరి

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానికి నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీకి పెళ్లయ్యాక మరింత డిమాండ్ పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఆమె క్రేజ్ కారణంగా రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తన కొత్త సినిమా “డాన్ 3” కోసం కియారా తీసుకుంటున్న భారీ పారితోషకం గురించి బాలీవుడ్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఇంతకీ కియారా రెమ్యూనరేషన్ ఎంత? ఈ సినిమా కోసం ఆమె ఎంత డిమాండ్ చేస్తోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

“డాన్ 3″లో హీరోయిన్ గా…
అమితాబ్ “డాన్” మూవీకి రీమేక్ గా 2007లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వచ్చిన “డాన్” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో అందులో హీరోగా నటించిన షారుక్ ఆ క్యారెక్టర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు. ఫస్ట్ పార్ట్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ గా “డాన్ 2″ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అది కూడా ఫర్వాలేదు అన్పించింది. ఇక తాజాగా దానికి కంటిన్యూగా మరో సీక్వెల్ ప్లాన్ చేశారు. డాన్ ఫ్రాంచైజీ గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ షారుక్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “డాన్ 3″లో రణవీర్ సింగ్ హీరోగా నటించబోతున్నారు. మొదటి రెండు భాగాల్లో హీరోగా నటించిన షారుక్ మూడవ పార్ట్ పై ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో, ఈసారి రన్వీర్ సింగ్ ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఈ సినిమాలో కియారా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

హీరోయిన్ కోసం గొడవ…
అయితే డాన్ 3 లో హీరోయిన్ సెలక్షన్ అంత ఈజీగా ఏమీ జరగలేదు. హీరోయిన్ విషయంలో హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ ఫర్హాన్ అక్బర్ కు మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. కియార అద్వానీ, కృతి సనన్ లలో ఎవరో ఒకరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. కానీ రణవీర్ సింగ్ మాత్రం కియారానే తీసుకోవాలని పట్టుబట్టాడట. ఎందుకంటే వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అంతేకాకుండా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో రన్వీర్ కియారా పేరును సూచించాడని సమాచారం.

- Advertisement -

భారీగా పారితోషకం పెంచేసిన కియారా
ప్రస్తుతం వరుసగా బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటున్న కియారాకు బాలీవుడ్ లో డిమాండ్ క్రేజీగా ఉంది. అలాగే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ “వార్ 2” మూవీలోనూ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె 6 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు “గేమ్ చేంజర్” అనే ప్యాన్ ఇండియా మూవీలో కీయరా హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తన దగ్గరకు వచ్చిన డాన్ 3 ఆఫర్ ను మరింత క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉంది ఈ అమ్మడు. అందులో భాగంగానే “డాన్ 3″కి కియారా ఏకంగా 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. కాగా ఈ మూవీ షూటింగ్ ఆగస్టు నెలలో మొదలు కానుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు