Allu Arjun : పుష్ప-3 ఓకే మరి గురూజీ సినిమా సంగతేంటి.?

గంగోత్రి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమాతోనే నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ సినిమాతో అల్లు అర్జున్ లో ఒక సరికొత్త యాంగిల్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఆర్య రోల్ ను బన్నీ పోషించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది.

ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సినిమాలన్నీ ఒక ఎత్తు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఒక ఎత్తు. పుష్ప సినిమా అల్లు అర్జున్ కి ఎంత పెద్ద ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ట్ చేసేసింది పుష్ప సినిమా. నేషనల్ అవార్డును కూడా తీసుకొచ్చింది ఆ సినిమా.

అయితే పుష్ప సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీస్, క్రికెటర్స్, పొలిటిషియన్స్ చాలామంది ఆ సినిమాలోని తగ్గేదేలే అనే డైలాగ్ ని ఎక్కడా తగ్గకుండా ఉపయోగించడం మొదలుపెట్టారు. అక్కడితో సినిమా అంచలంచెలుగా ప్రపంచం మొత్తం పాకుతూ పోయింది. అలానే సినిమాలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్ కూడా అదే లెవెల్ లో ఇచ్చాడు అని చెప్పొచ్చు.

- Advertisement -

సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు సినిమాల్ని చాలా స్టైలిష్ గా తెరకెక్కించే సుకుమార్ రంగస్థలం సినిమా తర్వాత సినిమాలను రస్టిక్గా తీయడం మొదలుపెట్టాడు. సుకుమార్ లోని ఈ యాంగిల్ కూడా ఉంది అని ప్రూవ్ చేశాడు రంగస్థలం సినిమాతో. అక్కడి నుంచి సుకుమార్ లెవెల్ కూడా వేరే రేంజ్ కి మారిపోయిందని చెప్పొచ్చు.

అయితే పుష్ప సినిమా తెలుగులో చూపించిన ఇంపాక్ట్ కంటే బాలీవుడ్ లో చూపించిన ఇంపాక్ట్ ఎక్కువ. ఇప్పుడు పుష్ప 2 సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు పెరిగాయి. పుష్ప 2 సినిమా కోసం యావత్ ప్రపంచమంతా ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తుంది. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక్కడితో ఆపకుండా పుష్ప-3 కూడా రాబోతున్నట్లు టీం ప్రకటించింది. అయితే పుష్ప-3 కి సంబంధించి కూడా కొంత రష్ ను షూట్ చేసినట్లు సమాచారం. ఆ రష్ షూట్ చూసిన తర్వాత కూడా పుష్ప-3 ఖచ్చితంగా చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డిసెంబర్ కి ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. 2025 సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ గా ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరికీ క్లారిటీ లేదు. ఇకపోతే ఆ ప్రాజెక్ట్ చేస్తే త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్ లో చేస్తాడా లేదా అన్న విషయం కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చేస్తే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ట్ కాబట్టి అదే లెవెల్ లోనే చేయాలి. ఏదేమైనా అధికారక ప్రకటన వచ్చేంతవరకు ఒక క్లారిటీ అంటూ రాదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు