Dhruv Vikram : ఇది కదా కాంబినేషన్ అంటే

తలపతి విజయ్ ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శంకర్ దర్శకత్వం వహించిన స్నేహితుడు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు తలపతి విజయ్. ఆ సినిమాతోనే మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు మురగదాస్. అక్కడితో విజయ్ కి మెల్లగా తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది స్టార్ట్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం విజయ్ కి తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ విజయ్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే.? విజయ్ నటిస్తున్న సినిమా తెలుగులో రిలీజ్ అవుతున్న కూడా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ కి రాడు అని ఒక కంప్లైంట్ ఉంది. అయితే తమిళ్లో కూడా విజయ్ ఎక్కువగా ప్రోమోషన్స్ లో పాల్గొడు. ఆ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే ఇస్తాడు. అయితే లాస్ట్ టైం దిల్ రాజు నిర్మాత వ్యవహరించిన వారసుడు సినిమా కోసం అయినా వస్తాడు అని చాలామంది ఊహించారు. అయితే ఆ సినిమాకి కూడా విజయ్ రాలేదు.

ఇకపోతే విజయ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో మంచి ఆదరణను పొందుకున్నాయి. అయితే ఏ పరిశ్రమలోనైనా కూడా ఒక స్టార్ హీరో కొడుకు హీరో అయితే చూడాలని చాలామంది అనుకుంటారు. అతని డెబ్యూ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తారు. తెలుగులో కూడా అలా స్టార్ హీరో కొడుకులు ఎప్పుడు వస్తారు అని చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్ కొడుకు మాత్రం నటనలో కాకుండా దర్శకత్వంలో తన ప్రతిభను చూపించడానికి రెడీ అవుతున్నాడు.

- Advertisement -

దళపతి విజయ్ కొడుకు జాసన్ విజయ్ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. జాసన్ విజయ్, చియాన్ విక్రమ్ కొడుకుతో కలిసి సినిమాను చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాను ఆదిత్య వర్మ గా తమిళ్లో తెరకెక్కించాడు గిరీషయ్యా. ఆ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ధ్రువ్. కాకపోతే ఆ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి మహాన్ సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే జాషన్ విజయ్ దర్శకత్వంలో ధ్రువ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ధ్రువ్ సరసన ఈ సినిమాలో అదితి శంకర్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు కూడా సమాచారం. అయితే దీని గురించిన అఫీషియల్ ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఏదేమైనా ఒక స్టార్ హీరో కొడుకు ఇంకో స్టార్ హీరో కొడుకు సినిమాకి దర్శకత్వం వహించడం అంటే, ఇది ఒక క్రేజీ కాంబినేషన్ అని చెప్పొచ్చు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు