Naga vamsi: దర్శకులను వదలని ప్రొడ్యూసర్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో సూర్యదేవర నాగ వంశీ ఒకరు. సూర్యదేవర నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతగా సినిమాలను నిర్మిస్తున్నారు. మొదట హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమయ్యే సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన నాగ వంశీ. ఆ తర్వాత ఆ బ్యానర్ కి అనుబంధంగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ను నిర్మించారు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఇప్పటివరకు చాలా మంచి సినిమాలు వచ్చాయి. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు ఫిలిం కూడా అదే బ్యానర్ లో వచ్చింది. అయితే కొన్ని విషయాల్లో నాగ వంశీ చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఆ బ్యానర్ కు ప్లస్ అవుతుంది. ఇంకొన్నిసార్లు ఇదే ఆ బ్యానర్ కి మైనస్ కూడా అవుతుంది.

ఈ బ్యానర్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు అని అంటే డీజే టిల్లు, మ్యాడ్ అనే చిన్న సినిమాలను చెప్పొచ్చు. ఈ సినిమాలు చిన్న సినిమాలుగా వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ను క్రియేట్ చేసి కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించాయి. మంచి కలెక్షన్లను కూడా కురిపించాయి. అయితే మ్యాడ్ విషయానికొస్తే రిలీజ్ కంటే ముందు రోజే ప్రీమియర్ షోస్ వేసి సినిమా పైన హైపు ను పెంచాడు నాగ వంశీ.

- Advertisement -

అలానే ఆదికేశవ అనే సినిమాకి కూడా ప్రీమియర్స్ వేశాడు. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా లేట్ అవుతున్న తరుణంలో మ్యాజిక్ అని మరో సినిమాని గౌతమ్ తిన్నానూరితో రెడీ చేయించాడు నాగ వంశీ.

అలానే ఇదే ప్రొడక్షన్ హౌస్ లో నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు” అనే సినిమాను కూడా అనౌన్స్ చేసి దానికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాతో కళ్యాణ్ శంకర్ దర్శకుడుగా పరిచయం అవ్వాలి. కానీ అనూహ్యంగా నవీన్ పోలిశెట్టి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఈ సినిమా లేట్ అయ్యే తరుణంలో మరో స్టోరీ ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి కళ్యాణ్ శంకర్ కి చెప్పాడు వంశీ. అప్పుడు శంకర్ చెప్పిన మ్యాడ్ స్టోరీ తోనే ఒక సినిమాను నిర్మించాడు నాగ వంశీ.

ఒక ప్రొడక్షన్స్ లో ఒక సినిమా తెరకెక్కడానికి దాదాపు నెలలు తరబడి, కొన్ని సినిమాలకైతే సంవత్సరాల తరబడి కూడా పడిగాపులు కాస్తుంటారు కొందరు దర్శకులు. కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ లో మాత్రం ఒక సినిమా డిలే అవుతున్న తరుణంలో మరో సినిమాని లైన్లో పెట్టి ఆ సినిమాతో దర్శకుణ్ణి పరిచయం చేయటం అనేది గర్వించదగ్గ విషయం. వాస్తవానికి నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్స్ ఉండటం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి కొన్నిసార్లు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు