NagaVamsi: ఆదికేశవ ప్రీమియర్స్ క్యాన్సిల్.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో “ఆదికేశవ” ఒకటి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పుడో ఆరునెలల కిందటే పూర్తయినా సరైన రిలీజ్ డేట్ దొరక్కా, ఓపెన్ గా చెప్పాలంటే పెద్ద సినిమాల పోటీవలన వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా నవంబర్ 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అది కూడా సోలో రిలీజ్ గా కాకుండా రెండు సినిమాలతో పాటు రిలీజ్ అవుతుంది.

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ వరకు ఇప్పటివరకు సినిమా పై ఒక్క పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ కాలేదన్నది వాస్తవం. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఎక్కడా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ కట్స్ ని డిజైన్ చేయకపోగా, ప్రతి సీన్ కూడా ఎక్కడో చూసినట్టు ట్రైలర్లో అనిపించింది. మరి ట్రైలర్ నే ఇంత రొటీన్ గా కట్ చేస్తే సినిమాని ఇంకెంత రాడ్ గా తీసాడేమో అని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉండగా ఈ చిత్ర నిర్మాత నాగవంశీ నిన్న ఆదికేశవ ప్రెస్ మీట్ పెట్టి మరి మా సినిమాకి పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నామని అనౌన్స్ చేసాడు. అయితే ఇంతకు ముందు కూడా తన సినిమాలకి అలాగే పెయిడ్ ప్రీమియర్లు వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఆదికేశవ సినిమాకి ఒకరోజు ముందు పడే ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయని తెలిసింది.

- Advertisement -

అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పిన ప్రీమియర్లు ఇక్కడ తిరుపతి ఒక్కచోటే తన సెంటిమెంట్ ప్రకారం వేస్తున్నారు. కానీ లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఆదికేశవ ఓవర్సీస్ ప్రీమియర్లు క్యాన్సిల్ చేసారని తెలుస్తుంది.

అయితే సినిమా ప్రీమియర్ షో లని క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీసన్ రిజల్ట్ మీద నమ్మకం లేకనే అని ట్రేడ్ విశ్లేషకుల సమాచారం. ఎందుకంటే ఆదికేశవ మూవీ పై ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ బజ్ కూడా క్రియేట్ కాలేదు. పైగా చిత్ర యూనిట్ కలిసి పలు షోల్లో పాల్గొని ప్రమోట్ చేసినా ఇంటర్వ్యూ లు ఇచ్చినా కూడా హైప్ అయితే రాలేదు. అందుకే ముందు జాగ్రత్తగా నెగిటివ్ స్ప్రెడ్ కాకుండా ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసారని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు