Manas: ఘనంగా బిగ్ బాస్ మానస్ పెళ్లి.. ఫోటోలు వైరల్..!

ప్రస్తుతం అటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనూ ఇతర సినిమా ఇండస్ట్రీలతో పాటు బుల్లితెర ఇండస్ట్రీలో కూడా చాలామంది బ్యాచిలర్ లైఫ్ ను వీడి వివాహాలు చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి ని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టగా.. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా పేరు దక్కించుకొని బుల్లితెర సీరియల్స్ తో మరింత ఫేమస్ సొంతం చేసుకున్న మానస్ కూడా పెళ్లి పీటలు ఎక్కారు.

మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక తో ఫ్రెండ్లీగా ఉంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన పెద్దగా వివాదాలకు పోకుండా ప్రేక్షకులను అలరించారు. ఇకపోతే ఈ నటుడు తాజాగా పెళ్లి చేసుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మముడి సీరియల్ తో ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న మానస్.. బిగ్ బాస్ లోనే కాదు కొన్ని సినిమాలలో కూడా నటించారు. అంతేకాదు ప్రైవేట్ ఆల్బమ్స్, టీవీ షో లతో బిజీగా ఉన్న ఈయన ఈ మధ్యనే సెప్టెంబర్ రెండవ తేదీన శ్రీజ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ అమ్మాయి విజయవాడకు చెందిన అమ్మాయి తో మానస్ ఎంగేజ్మెంట్ హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు వీరి పెళ్లి మరింత అంగరంగ వైభవంగా జరిగినట్లు సమాచారం.

ఇక నిన్న బుధవారం రాత్రి విజయవాడలో మురళి రిసార్ట్స్ వేదికగా శ్రీజ, మానస్ ల వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితులు , స్నేహితుల మధ్య జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి పలువురు సినీ , టీవీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక అభిమానులు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు