Bellamkonda Sai Sreenivas: నాగేశ్వరరావు దెబ్బకి పారిపోయిన ‘స్టూవర్టుపురం’ దొంగ!

టాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బెల్లంకొండ సురేష్ కొడుకుగా బడా ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు. ఆ తరువాత బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ తో సినిమాలు చేసాడు. కానీ దరిద్రం పక్కనే ఉంటుందేమో ఇప్పటివరకు సరైన హిట్ లేదు. లాక్ డౌన్ లో చేసిన రాక్షసుడు ఓ మోస్తరు సెమి హిట్ అయినా హీరో క్రెడిట్ ఏమి లేదు.

అయితే తెలుగులోనే సక్సెస్ అవ్వలేని ఈ హీరో హిందీలో ఎదో పొడిచేద్దామని బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ రిజల్ట్ చేసిన డ్యామేజీ మనకి తెలియంది కాదు. అయితే కెరీర్లో ఎన్నో ఆశల్ని పెట్టుకుని చేద్దామనుకున్న ఓ భారీ పాన్ ఇండియా సినిమాని ఫినిష్ చేయకుండానే పక్కన పెట్టేసాడు ఈ బెల్లంకొండ కుర్రాడు.

అసలు విషయానికొస్తే స్టూవర్టుపురం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ని ఊహించి ఓ ఫిక్షనల్ స్టోరీని సినిమాగా తీద్దామని బెల్లంకొండ సురేష్ రెండేళ్ల కిందట మూవీ అనౌన్స్ చేసారు. కొత్త డైరెక్టర్ ని పెట్టి “స్టువర్టుపురం దొంగ” పేరుతో ఫస్ట్ లుక్స్ ని కూడా రిలీజ్ చేసారు. ఆ పోస్టర్లు బాగానే ఉన్నా, ఛత్రపతి రీమేక్ పై దృష్టి పెట్టి ఈ సినిమాకి గ్యాప్ ఇచ్చాడు బెల్లంకొండ.

- Advertisement -

అయితే ఈ లోపు తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ఆఫీసియల్ గా తీయడం, రిలీజ్ కావడం జరిగిపోయాయి. ఈ మూవీ స్టోరీ కూడా ఫిక్షనలే అయినా, స్టువర్టుపురం దొంగకి నాగేశ్వరరావు సినిమా స్టోరీకి పోలికలు ఉండడంతో స్క్రిప్ట్ లో చేంజెస్ చేద్దామని అనుకున్నారు. కానీ టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ కావడంతో బెల్లంకొండ స్టువర్టుపురం దొంగ ని పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఇక ఈ సినిమా పూర్తిగా ఆగిపోయినట్టే అంటున్నారు జనాలు. మరి ఈ బెల్లంకొండకి నిఖార్సైన ఫస్ట్ హిట్ ఎప్పుడు దొరుకుతుందో..

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు