Tiger Nageshwararao: సినిమాకోసం బాగానే కష్టపడుతుంది.. కానీ క్రెడిట్ దక్కేనా?

Tiger Nageshwararao:

టాలీవుడ్ లో కొత్త హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే వాళ్లలో కొందరే సక్సెస్ అవుతారు. కొందరు గ్లామర్ షో తో నెట్టుకొచ్చినా స్టార్ స్టేటస్ అందుకోవడం కష్టం. దానికి హిట్స్ కూడా అవసరం. ఇక ఈ ఇయర్ ఒక పెద్ద సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నుపుర్ సనన్.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలైన ఈ భామ ఫస్ట్ సినిమా టాలీవుడ్ లోనే చేస్తుంది. అదే “టైగర్ నాగేశ్వరరావు”. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ఈ సినిమా కోసం బాగా కష్టపడుతుంది నుపుర్ సనన్. ముఖ్యంగా ప్రమోషన్ల టైం లో అన్ని చోట్ల సందడి చేస్తూ తన వంతు కృషి చేస్తుంది. ఎంతైనా ఫస్ట్ సినిమా కాబట్టి ఆ మాత్రం ఫోకస్ ఉంటుంది.

అయితే ఇంత కష్టపడ్డా సినిమాలో తనకి క్రెడిట్ ఎంత వరకు దక్కుతుంది అనేదే అసలు విషయం. ఎందుకంటే ఈ సినిమాలో నుపుర్ సనన్ మెయిన్ హీరోయిన్ అయినా, తనతో పాటు గాయత్రీ భరద్వాజ్ అనే అమ్మాయి కూడా హీరోయిన్ గా చేసింది. మరి నుపుర్ సనన్ క్యారెక్టర్ కి సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలియదు గాని, ట్రైలర్ లో చూస్తే, ఈ అమ్మడిని గ్లామర్ షోకే పరిమితం చేశారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మరి నుపుర్ సనన్ ప్రమోషన్ల విషయంలో పడే కష్టానికి ఫలితం ఈమేరకు దక్కుతుందో సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు