Maruthi: అప్పుడు నడిచింది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందా.?

ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ తేడాలు ఉండేవి. కానీ ఇప్పుడు మంచి సినిమా మాత్రమే అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది. ఎందుకంటే రోజులు మారుతున్న కొద్దీ తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు సంభవించాయి. ఇప్పుడు సినిమాల్లో కంటెంట్ కింగ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అది కూడా ప్రూవ్ అవుతూ వచ్చింది ఒక మంచి కంటెంట్ ఏ భాషలో ఉన్నా కూడా ఆడియన్స్ ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడం మొదలుపెట్టారు.

ఇకపోతే తెలుగులో కూడా ఇప్పుడు కాకుండా కొన్నేళ్ల క్రితం కొన్ని సినిమాలు కొద్దిపాటి సంచలనాన్ని సృష్టించాయి. అప్పటికి ఆ సినిమాల్లో ఉన్న కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, కొన్ని సాంగ్స్, కొన్ని జోక్స్ వలన ఆ సినిమాలు కొద్దో గొప్పో వర్కౌట్ అవుతూ వచ్చాయి. మంచి రికార్డ్స్ ని కూడా సృష్టించాయి అని ఒక రకంగా చెప్పొచ్చు.

కానీ అదే సినిమాలను మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ చూస్తారా అనడంలో మాత్రం ఒక రకమైన సందేహం ఉంది. ఎందుకంటే సినిమాలు మారుతున్న కొద్ది కామెడీ ని చూసే విధానం కూడా మారిపోయింది. ఒకప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు కంటే కూడా ఇప్పుడు క్లీన్ కామెడీని చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు.

- Advertisement -

ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా చాలా సినిమాలను రీ రిలీజ్ చేసే ప్లాన్ లో పడ్డారు తెలుగు సినిమా పరిశ్రమ లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్. సూపర్ హిట్ సినిమాలను రీమాస్టర్ చేసి వదలటం వేరు. అప్పట్లో ఏదో హిట్ అయిపోయిన సినిమాను మళ్ళీ రీమాస్టర్ చేయటం అంటే, దానికి అంత ఆదరణ లభిస్తుందని చాలామంది అనుకోరు.

ఇక అసలు విషయానికి వేస్తే మారుతి దర్శకుడుగా పరిచయమైన సినిమా “ఈ రోజుల్లో” అప్పుడు సొసైటీలో యూత్ మధ్య జరుగుతున్న కొన్ని వాస్తవిక సంఘటనలని ఆధారంగా చేసుకుని, ఆ సినిమాలో చూపించాడు మారుతి. అయితే ఆ సినిమాలో చూపించిన విధానం ఆ సినిమాలోని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ కూడా అప్పటి యూత్ కి కొంత మేరకు ఎక్కి ఆ సినిమా కూడా హిట్ అయింది.

5d క్యామ్ ఆ సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు మారుతి. అయితే మారుతి ఎంచుకున్న రూట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. కెరియర్ మొదట్లో అటువంటి సినిమాలు తీసిన మారుతి తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే సినిమాలను చేశాడు. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి చేసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీతో పాటు అందరూ కూర్చుని చూసే విధంగా ఉంటాయి.

ఇకపోతే “ఈ రోజుల్లో” సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 23వ తారీఖున ఈ సినిమా థియేటర్లో మళ్ళీ రిలీజ్ కానుంది. అయితే అప్పుడు లభించిన ఆదరణ ఈ సినిమాకి ఇప్పుడు లభిస్తుందో లేదో తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ఒక్కడు, పోకిరి, ఖుషి లాంటి క్లాసిక్ సినిమాలకు బ్రహ్మరథం పట్టిన ఆడియన్స్ ఇటువంటి సినిమాల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడక తప్పదు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు