Kick: మాస్ మహారాజ్ మరో సినిమా రీ రిలీజ్ కల్లెక్షన్లు ఎలా ఉన్నాయంటే!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “కిక్” సినిమా మార్చి 1న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే గాకుండా, రవితేజ లోని కామెడీ యాంగిల్ ని సరిగ్గా వాడుకుంటే ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో ఈ సినిమా చూపించింది. ఇక పదిహేనేళ్ల తర్వాత రీ రిలీజ్ అయినా కూడా ఈ సినిమా అదే రేంజ్ రెస్పాన్స్ ని తెచ్చుకోవడం విశేషం. అయినా టాలీవుడ్ లో రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ బాగానే జోరు అందుకున్నా, ఒక స్టేజ్ తర్వాత మాత్రం రీ రిలీజ్ లు కూడా స్లో డౌన్ అయ్యాయి. కానీ డిమాండ్ ఉన్న సినిమాలు కొన్ని అప్పుడప్పుడూ మంచి కల్లెక్షన్లనే రాబట్టాయి.

సమరసింహారెడ్డి ప్లాప్ రెస్పాన్స్..

రీ రిలీజ్ సినిమాల హడావిడి తగ్గింది, ప్రేక్షకులను బోరు కొట్టింది అని తెలియడానికి బాలయ్య రీసెంట్ సినిమా సమరసింహారెడ్డి కి వచ్చిన ప్రేక్షకాదరణ ఉదాహరణ. బాలయ్య సమరసింహారెడ్డి పాతికేళ్ళు అయిన సందర్బంగా రీ రిలీజ్ ప్లాన్ చేసి, దాదాపు 400 కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా కనీసం ఒక్కరోజైనా హౌస్ ఫుల్ థియేటర్లలో ఆడలేదు. రీ రిలీజ్ మొత్తంలో బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమా కేవలం 12 నుండి 15 లక్షల లోపు గ్రాస్ వసూలు చేసిందని అంచనా.

- Advertisement -

కిక్ సూపర్ రెస్పాన్స్..

అయితే సమరసింహారెడ్డి రీ రిలీజ్ అయిన మార్చ్ 1నే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా రీ రిలీజ్ అయింది. చాలా లిమిటెడ్ గా 150 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుని డీసెంట్ కలెక్షన్లు సాధించింది. కొత్త సినిమాల రిలీజ్ ఎఫెక్ట్ కారణంగా ఈ సినిమాకు కాస్త హడావిడి తగ్గినా బాలయ్య సినిమాలో సగం కంటే కూడా తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి, సమరసింహారెడ్డి కంటే కూడా ఎక్కువగా 26 లక్షల దాకా గ్రాస్ వసూలు చేసిందంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. పైగా ఈ నెల ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి ఇంకా తక్కువ వచ్చాయి లేదంటే, వెంకీ రేంజ్ లో కోటికి పైగా కలెక్షన్లు కొల్లగొట్టేది.

మొత్తం మీద రీసెంట్ గా రిలీజ్ అయిన ఇతర రీ రిలీజ్ సినిమాలతో పోల్చితే కిక్ మీద ఉన్న అంచనాల దృశ్యా పర్వాలేదనే వసూళ్లు వచ్చాయని చెప్పాలి. ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ ఇప్పటికీ నడుస్తున్నా కూడా అన్ సీజన్ ఇంపాక్ట్ అయితే అన్ని సినిమాల మీద ఉంటుందని రీసెంట్ రీ రిలీజ్ సినిమాలు రుజువు చేస్తున్నాయి… ఇక ముందు ముందు రామ్ చరణ్ బర్త్ డే కి చిరుత, అలాగే వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు