Life style : ఈ చిన్న చిన్న అలవాట్లతో లైఫ్ లో ఊహించని చేంజ్

బుద్ధిజంలో ఉన్న కొన్ని చిన్న చిన్న అలవాట్లను అలవాటు చేసుకుంటే జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే వీటిని ఫాలో అయితే చాలు. మరి ఇంతకీ ఆ హ్యాబిట్స్ ఏంటి అంటే…

1. గ్రాటిట్యూడ్
ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ రోజును కృతజ్ఞతతో మొదలు పెట్టండి. ఈ సాధారణ అలవాటే పాజిటివిటిని పెంచుతుంది. ఇలా కృతజ్ఞత భావంతో డేను స్టార్ట్ చేయడం వల్ల సంతృప్తికరమైన జీవితం మన సొంతం అవుతుంది.

2. మైండ్ ఫుల్ బ్రీతింగ్
మైండ్ ఫుల్ నెస్ అనేది మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి ఒక మంచి మార్గం. కేవలం రెండు నిమిషాల పాటు చేసే మైండ్ ఫుల్ నెస్ బ్రీతింగ్ వల్ల ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి పెరుగుతుంది.

- Advertisement -

3. దయ
బౌద్ధమతం కరుణ, దయల విలువ ఏంటో బోధిస్తుంది. అవతలి వ్యక్తి పట్ల కరుణ చూపించడం అనేది వాళ్లపైనే కాకుండా మన మనసులపై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. దానివల్ల మనతో పాటు మన చుట్టుపక్కల పాజిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం అనేది అలవాటవుతుంది.

4. మైండ్ ఫుల్ ఈటింగ్
భోజనం అనగానే ఏదో తిన్నాంలే అని అనిపించకుండా దాన్ని ఆస్వాదిస్తూ తిన్నప్పుడే మైండ్ ఫుల్ ఈటింగ్ అవుతుంది. భోజనం రుచి, వాసన వంటి వాటిని గమనిస్తూనే ఆ ప్లేట్ మీ దగ్గరికి చేరుకోవడానికి పట్టిన ప్రయాణాన్ని, అది చేయడానికి పడిన శ్రమను గుర్తించడం, పొగడడం, ఆస్వాదిస్తూ తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం, మనశాంతికి మనశ్శాంతి లభిస్తాయి. అలాగే ఆహారం అనేది మన శరీరాలను పోషించే విలువైన అంశం అనే విషయం గుర్తుపెట్టుకుంటాం.

5. సైలెన్స్
ఈ బిజీ బిజీ ప్రపంచంలో కాసేపు నిశ్శబ్దంగా గడపడం అనేది ఒక అరుదైన అంశం అని చెప్పాలి. ఆ నిశ్శబ్ద క్షణంలోనే నిజంగా మనతో మనం కనెక్ట్ అవ్వగలం. కాబట్టి ప్రతిరోజు సైలెంట్ గా కూర్చోవడానికి కొన్ని నిమిషాలు కేటాయించడం అలవాటు చేసుకోండి. నిశ్శబ్దం అనేది రెగ్యులర్ గా వినే మనం గందరగోళ శబ్దాల నుంచి మనకు కాస్త విరామాన్ని అందిస్తుంది. అలాగే ఆత్మ పరిశీలనతో పాటు అంతరంగంతో అనుసంధానం అవ్వడానికి ఒక అవకాశం లభిస్తుంది.

6. మైండ్ ఫుల్ వాకింగ్
వ్యాయామం అనేది శరీరానికి ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బౌద్ధమతంలో మైండ్ ఫుల్ వాకింగ్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిసరు. నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు, ఆ సమయంలో తీసుకునే శ్వాస వంటి విషయాలపై దృష్టి పెట్టి పూర్తి అవగాహనతో వాకింగ్ చేయాలన్న మాట.

7. కాఫీ లేదా టీ
చేతుల్లోకి కాఫీ వచ్చినప్పుడు దాని వెచ్చదనాన్ని అనుభూతి చెందండి. కాఫీ సువాసనను ఫీల్ అవ్వండి. ప్రతి సిప్ ను మొదటి సిప్ గా భావించి ఆస్వాదించండి. దీనివల్ల ఆ కాఫీలోని ప్రతి చుక్క టేస్ట్ చేయగలుగుతారు. అలాగే ప్రశాంతత కూడా అలవడుతుంది.

8. వినండి
ఎవరికైనా సరే చెప్పేది పూర్తిగా వినే వాళ్ళు దొరకడం అదృష్టం అని చెప్పాలి. ఈరోజుల్లో వినే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మైండ్ ఫుల్ లిజనింగ్ అనేది పూర్తి శ్రద్ధతో అవతల వ్యక్తి చెప్పేది వినడం, పరధ్యానానికి గురికాకుండా లేదా వాళ్లు మాట్లాడడం ముగించే లోపే రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఒక మంచి టిప్ లాంటిది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు