Bhimaa : ఆ రెండూ ఇప్పుడొచ్చుంటే బ్లాక్ బస్టర్స్ అయ్యేవి – గోపీచంద్

టాలీవుడ్ మాచో స్టార్ గోపిచంద్ హీరోగా నటించిన భీమా ఫైనల్ గా మరో రెండు రోజుల్లో మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయిపోతుంది. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా చాలా కాలం తర్వాత గోపీచంద్ నుండి ఎదురుచూస్తున్న ఒక మాస్ కమెర్షియల్ మూవీ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకొని భారీ హైప్ ని తీసుకొచ్చాయి. ఇక గోపీచంద్ కూడా చిత్ర యూనిట్ సహా మూవీ రిలీజ్ అయ్యేంత వరకు భీమా ప్రమోషన్లలో బిజీ అయ్యాడు. అయితే గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖార్సైన హిట్ కొట్టి దాదాపు పదేళ్లవుతోంది. అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టగా ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ 10 ఏళ్లకి ఆడియన్స్ లో మంచి క్రేజీ బజ్ ను సొంతం చేసుకున్న తన లేటెస్ట్ మూవీ భీమా థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమయింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా గోపీచంద్ తన తదుపరి సినిమాల ప్రాజెక్ట్ ల గురించి గత సినిమాల విషయాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

ఆ రెండు ఇప్పుడొచ్చుంటే బ్లాక్ బస్టర్ పక్కా..

భీమా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న గోపీచంద్ ప్రమోషన్స్ లో భాగంగా తన గత చిత్రాల గురించి మాట్లాడుతూ యాంకర్ ఇలా అడిగాడు. ఒకప్పుడు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ని తీశారు. కానీ ఆ సినిమాలు ఆ టైం కన్నా చాలా ముందు అడ్వాన్స్డ్ జెనరేషన్ కి చెందిన కథతో రాగా ఆ టైంకి ఆడియన్స్ కి ఉన్న టేస్ట్ కి అంచనాలను అందుకోలేక పోయాయి. అని యాంకర్ అంటే, వెంటనే గోపీచంద్ దానికి రిప్లై ఇస్తూ ఆ టైంకి ఆ కథలు కొత్తగా అనిపించినా ఆడియన్స్ అంచనాలను అందుకోలేదని కానీ, అవే కథలు కోవిడ్ తర్వాత మారిన ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లు, ఇప్పుడు రిలీజ్ అయ్యి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్స్ గా ఆ సినిమాలు నిలిచేవని చెప్పారు ఆ సినిమాలు మరేవో కాదు…

- Advertisement -

ఒక్కడున్నాడు, సాహసం.. ఇప్పుడొస్తే..

ఆ రోజుల్లో బాంబే బ్లడ్ గ్రూప్ నేపధ్యంలో ఆల్ మోస్ట్ ఒకే డ్రెస్ పై షూటింగ్ చేసిన ఒక్కడున్నాడు మూవీ, అలాగే ట్రెజర్ హంట్ నేపధ్యంలో వచ్చిన సాహసం సినిమాలు ఇప్పుడు కనుక వచ్చి ఉంటే ఖచ్చితంగా భారీ విజయాలను నమోదు చేసి ఉండేవని చెప్పుకొచ్చాడు గోపీచంద్. మరి ఇప్పుడు ఎందుకని ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ చేయడం లేదని యాంకర్ అడిగితే… అలాంటి కథలు చాలా తక్కువగా వస్తున్నాయని, అప్పుడప్పుడూ అలాంటి కథల్ని వింటున్నానని చెప్తూ, కానీ డైరెక్టర్స్ ఆ కథలను హ్యాండిల్ చేస్తారు అన్న నమ్మకం కలగడం లేదని, అలా అనిపించినపుడుఖచ్చింతంగా అలాంటి కథలను చేస్తానని చెప్పుకొచ్చారు గోపీచంద్.

ఇక భీమా సినిమా విషయానికి వస్తే కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. కెజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవిబాసూర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, బీజీఎమ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని మేకర్స్ చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు భీమా సినిమా ఖచ్చితంగా అంచనాలను అందుకుంటుంది అని, గోపీచంద్ సాలిడ్ కం బ్యాక్ ఇస్తారని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు