WAR2: తారక్ రోల్ పై అదిరిపోయే అప్డేట్…

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో “దేవర” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తర్వాతి సినిమాలపై ఫాన్స్ లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. అయితే దేవర తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, అలాగే బాలీవుడ్ లో యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో వార్ 2 సీక్వెల్ లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే. వీటి మధ్యలో దేవర పార్ట్ 2 కూడా చేయవచ్చు. ఇంత కేజ్రీగా తారక్ సెన్సేషనల్ లైనప్ ని సెట్ చేసుకోగా ఈ చిత్రాల్లో తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం “వార్ 2” పై కూడా సాలిడ్ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా వార్2 నుండి ఓ సాలిడ్ క్రేజీ అప్డేట్ ఎన్టీఆర్ పై వచ్చింది. ఇక ఈ అప్డేట్ ఒక రకంగా పండగ లాంటి మాస్ అప్డేట్ అనుకోవచ్చు.

మల్టీ స్టారర్ వార్ 2 :

బాలీవుడ్ లో తెరకెక్కబోయే భారీ ప్రాజెక్టులలో ఈ వార్2 సినిమా కూడా ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కబోయే మల్టీ స్టారర్ సినిమా సమ్మర్ చివర్లో మొదలవుతుందని సమాచారం. ఫస్ట్ వార్ లో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించాడు. ఇక వార్ 2 లో హృతిక్ తో పాటుగా తారక్ కూడా సాలిడ్ కాప్ రోల్ లో నటిస్తుండగా ఇప్పుడు తన పాత్రకి సంబంధించి ఎగ్జైటింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. వార్ 2 ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట. ఇప్పటివరకు వరకు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో స్పై యూనివర్స్ లో వచ్చిన ఏజెంట్స్ తరహాలోనే ఎన్టీఆర్ కూడా వార్2 లో ఓ ‘ఇండియన్ ఏజెంట్’ గా కనిపించనున్నాడని, తన కోసం సెపరేట్ ట్రాక్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

- Advertisement -

ఆ టైగర్ లా కాదు.. యంగ్ టైగర్…

అయితే వార్2 గురించి ఓ చిన్న అనుమానం తారక్ ఫ్యాన్స్ లో ఉండేది. అదేంటంటే.. వార్ ఫస్ట్ పార్ట్ లో టైగర్ ష్రాఫ్ పాత్ర ఏజెంట్ అయినా, ఆ పాత్ర క్లైమాక్స్ లో నెగిటివ్ అవుతుంది. అలా ఎందుకంటే సినిమా చూస్తే తెలుస్తుంది. అయితే వార్ 2 లో ఎన్టీఆర్ రోల్ ని కూడా అలా చేస్తారా అన్న ఒక సందేహం ఫ్యాన్స్ లో ఉండేది. అయితే చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సీక్వెల్ మల్టీ స్టారర్ లో ఎలాంటి విలన్ కూడా కాదని హృతిక్ తో కలిసి విలన్ ని ఎదుర్కొనే సమాన పాత్రలో తాను కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే తారక్ రోల్ వీరి స్పై యూనివర్ నుంచి వచ్చే మరిన్ని చిత్రాల్లో కనిపించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇక తారక్ పాత్రలో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయని సమాచారం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే బాలీవుడ్ మూవీ వార్ 2 స్టార్ట్ చేస్తాడు. అలాగే ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ గనుక సలార్ 2 కోసం గ్యాప్ తీసుకుంటే ప్రశాంత్ సినిమా పై ఎన్టీఆర్ ఫోకస్ పెట్టొచ్చు. ఒకవేళ ఇదీ జరగకపోతే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా ఉందని టాక్. దాన్ని మొదలెట్టొచ్చు. ఇవన్నీ గాకుండా దేవర పార్ట్ 1 రిలీజ్ అయ్యాక, ఇందులో ఏదో ఒక సినిమా చేస్తూనే దేవర పార్ట్ 2 ని సెట్స్ పైకి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సినిమాలతో తారక్ పాన్ ఇండియా లెవెల్లో రచ్చ చేయడం ఖాయం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు